Woman molested by gang at kodada in suryapet : సూర్యపేట జిల్లాలో దారుణమైన ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఒక మహిళను తమ ఇంటికి రప్పించుకున్నారు. వారిలో ఒకరు తెలిసిన వారే కావడంతో మహిళ ఇంటికి వెళ్లింది. దీంతో ఆమెకు కూల్ డ్రింక్ తాగడానికి ఇచ్చారు. ఆ తర్వాత.. అపస్మారక స్థితిలోనికి వెళ్ళగానే గదిలో బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు. మూడు రోజుల పాటు బాధితురాలిని ఇంట్లోనే బంధించారు. ఎలాగోలా తప్పించుకున్న మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల ప్రకారం.. కోదాడలో అమానుషం జరిగింది. ఒక మహిళను మాయమాటలు చెప్పి ఇంటికి రప్పించుకున్నారు. ఆ తర్వాత.. ఆమెకు మత్తు మందు తాగడానికి ఇచ్చారు. ఆమె అపస్మారక స్థితిలోనికి వెళ్లగానే ఆమెను గదిలో బంధించారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మహిళను బంధించారు. నిందితులు ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. నిందితులలో ఒక రాజకీయ నాయుకుడి కుమారుడితో సహా... మరో ముగ్గురు ఉన్నట్లు మహిళ తన ఫిర్యాదులో తెలిపింది. దీంతో మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఒడిశాలో యువతిపై కూడా ఈ కోవకు చెందిన ఘటన జరిగింది.
Odisha Court Sentences Minor To 10 Years Imprisonment: ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో దారుణ ఉదంతం జరిగింది. జాతరకు తీసుకెళ్తానని చెప్పి ఒక బాలుడు.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గతంలో జరిగింది. తాజాగా, నిందితుడికి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సమాజంలో.. మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులను (Molested on Woman) నిరోధించడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొందరు కామాంధులలో మార్పులు రావడం లేదు. ఇప్పటికి మహిళలు, యువతులను టార్గెట్ చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారు.
పూర్తి వివరాలు.. ఒడిశాలోని కియోజంర్ జిల్లాలో దారుణం జరిగింది. ఒక బాలుడు .. బాలికను జాతరకు తీసుకెళ్తానని మాయమాటలు చెప్పాడు. అతని మాయమాటలు నమ్మి.. ఆమె అతనితో వెళ్లింది. ఆ తర్వాత.. ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన జరిగిన తర్వాత.. వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 15, 2017న నేరం చేసినందుకు దోషికి పోక్సో న్యాయమూర్తి సుభాశ్రీ త్రిపాఠి ₹ 5,000 జరిమానా కూడా విధించారు. అత్యాచార బాధితురాలికి ₹ 4 లక్షలు పరిహారంగా చెల్లించాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. అదే విధంగా నిందితుడు.. జువైనల్‌లో 21 ఏళ్లు వచ్చే వరకు ఉండాలని ఆతర్వాత.. సాధారణ జైలుకు తరలించాలని కోర్టు అధికారులను ఆదేశించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Gang rape, Suryapet, Telangana crime