హోమ్ /వార్తలు /క్రైమ్ /

Interesting Family: అసలు ఈ ఫ్యామిలీ గురించి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉంటది..

Interesting Family: అసలు ఈ ఫ్యామిలీ గురించి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉంటది..

సునీల్‌తో సుధ, ఆమె పిల్లలు

సునీల్‌తో సుధ, ఆమె పిల్లలు

ఏడేళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ వివాహిత, తన ఇద్దరు పిల్లలు కనిపించకుండాపోయారు. భార్యాపిల్లల కోసం భర్త ఎంత వెతికినా ప్రయోజనం లేకుండాపోయింది. పోలీసులు ఎట్టకేలకు ఆ మహిళ ఆచూకీ ఇన్నేళ్లకు కనుగొన్నారు. అయితే.. ట్విస్ట్ ఏంటంటే.. ఆ మహిళ ఓ వ్యక్తితో కలిసి ఉంటోంది. అతనే ‘మీ నాన్న’ అని పిల్లలకు చెప్పింది.

ఇంకా చదవండి ...

గ్వాలియర్: ఏడేళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ వివాహిత, తన ఇద్దరు పిల్లలు కనిపించకుండాపోయారు. భార్యాపిల్లల కోసం భర్త ఎంత వెతికినా ప్రయోజనం లేకుండాపోయింది. పోలీసులు ఎట్టకేలకు ఆ మహిళ ఆచూకీ ఇన్నేళ్లకు కనుగొన్నారు. అయితే.. ట్విస్ట్ ఏంటంటే.. ఆ మహిళ ఓ వ్యక్తితో కలిసి ఉంటోంది. అతనే ‘మీ నాన్న’ అని పిల్లలకు చెప్పింది. చిన్న వయసులోనే తల్లి తీసుకొచ్చేయడంతో ఆ పిల్లలు కూడా అతనే తండ్రి అని నమ్మారు. కానీ.. ఆ వ్యక్తి వాళ్ల తల్లి ప్రియుడని పిల్లలకు తెలియదు.

మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ వ్యక్తికి కూడా ఇదివరకే పెళ్లైంది. 15 రోజులు భార్యతో ఉంటూ.. వ్యాపారం పేరుతో మరో 15 రోజులు ప్రియురాలితో అతను కలిసి ఉండటం కొసమెరుపు. ఏడేళ్ల నుంచి ఆ వ్యక్తి మొదటి భార్యకు తెలియకుండా ప్రియురాలితో కలిసి ఉంటున్నాడు. పోలీసులకు ఇదంతా తెలిసి అవాక్కయ్యారు. ఈ ఘటన గ్వాలియర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జితేంద్ర సింగ్ కుషావహ అనే వ్యక్తి రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న ఓ కాల్ సెంటర్‌లో పనిచేసేవాడు. పదిహేనేళ్ల క్రితం జితేంద్ర సబల్‌గర్‌కు చెందిన సుధను పెళ్లి చేసుకున్నాడు. జితేందర్ పెళ్లయ్యాక భార్యతో కలిసి కొన్ని నెలలు సునీల్ అనే వ్యక్తి ఇంట్లో సబల్‌గర్‌లోనే ఉన్నాడు. పెళ్లయిన సంవత్సరం తర్వాత సుధ పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత సంవత్సరం ఓ బాబు పుట్టాడు. భార్యా, ఇద్దరు పిల్లలతో కలిసి జితేంద్ర మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు.

నాథూసింగ్ అనే వ్యక్తి ఇంట్లో కుటుంబంతో కలిసి జితేంద్ర అద్దెకు ఉండేవాడు. అలా ఉండగా.. జితేంద్ర ఉద్యోగ నిమిత్తం భార్యాపిల్లలను అక్కడే వదిలి జైపూర్ వెళ్లిపోయాడు. పిల్లల చదువు పాడవుతుందని.. విద్యా సంవత్సరం పూర్తి కాగానే తీసుకెళ్లాలని జితేంద్ర భావించాడు. అయితే.. మార్చి 23, 2014న జైపూర్‌లో ఉన్న జితేంద్రకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్‌తో అతని జీవితమే ఊహించని మలుపు తిరిగింది. నీ భార్య, పిల్లలు కనిపించడం లేదని ఇల్లు అద్దెకు ఇచ్చిన యజమాని ఫోన్ చేయడంతో జైపూర్ నుంచి జితేంద్ర హుటాహుటిన గ్వాలియర్‌కు వెళ్లాడు. తన భార్యాపిల్లలు కనిపించకుండాపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో జితేంద్ర భార్యాపిల్లలకు సంబంధించి ఎక్కడున్నారో ఎలాంటి ఆధారాలు దొరకలేదు.

సుధ, పిల్లలు కనిపించకుండా పోయిన సమయంలో ఆ పిల్లల వయసు పాపకు ఏడేళ్లు, బాబుకు ఆరేళ్లు. సబల్‌గర్‌లో ఇల్లు అద్దెకు ఇచ్చిన వ్యక్తిపై సుధ కుటుంబం అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ అతనిని విచారించినా ఫలితం లేకుండా పోయింది. ఈ మిస్సింగ్ కేసు అలా మరుగున పడిపోయింది. అయితే.. తాజాగా ఈ మిస్సింగ్ కేసు మిస్టరీని తేల్చాలని సీఎస్పీ రవి బదౌరియా ఈ కేసు ఫైల్‌ను ఏఎస్‌ఐ శైలేంద్ర సింగ్ చౌహాన్‌కు అప్పగించారు. దీంతో.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ కేసులో విచారణ ముందుకు సాగింది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న జితేంద్ర, అతని భార్య పెళ్లయిన కొత్తలో సబల్‌గర్‌లో అద్దెకు ఉన్న ఇంటి యజమాని సునీల్‌ను మళ్లీ విచారించారు. కానీ.. సునీల్ అప్పుడేం చెప్పాడో.. ఇప్పుడూ అదే చెప్పాడు.

తనకూ, వాళ్లు అదృశ్యం కావడానికి ఎలాంటి సంబంధం లేదని.. భార్య, నలుగురు కూతుర్లతో సంతోషంగా ఉన్న తనను ఈ కేసుల్లోకి లాగవద్దని సునీల్ కోరాడు. అతనిని విచారించిన ఏఎస్‌ఐ శైలేంద్ర సునీల్‌పై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులకు చెప్పాడు. మరో పక్క సునీల్ కాల్ డేటాను, టవర్ లొకేషన్‌ను పరిశీలించాడు. ఇక్కడ ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఒకే నంబర్‌కు సునీల్ ఎక్కువ సార్లు కాల్ చేసినట్లు తెలిసింది. మరో పాయింట్ ఏంటంటే.. నెలలో 12 నుంచి 15 రోజులు సునీల్ మొబైల్‌కు సంబంధించి టవర్ లొకేషన్ ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ ప్రాంతాన్ని చూపించింది. దీంతో.. సునీల్‌ను పిలిచి పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బట్టబయలైంది. తన ప్రియురాలు సుధ, ఆమె పిల్లలను బృందావన్‌లో ఉంచి.. ప్రతి నెలా వ్యాపారం నిమిత్తం వెళుతున్నానని భార్యకు చెప్పి 15 రోజులు వాళ్లతో ఉండి వస్తుంటానని సునీల్ చెప్పాడు.

ఇది కూడా చదవండి: Married Woman: సీఎంకు ఫేస్‌బుక్‌లో ‘Please Help Me, Sir’ అని పోస్ట్ పెట్టి వివాహిత ఆత్మహత్య..

ఇలా తాను సుధ దగ్గరకు వెళుతున్న విషయం తన భార్యకు తెలియదని, సుధతో జీవితాంతం ఉండాలన్న ఉద్దేశంతోనే ఇలా ఏడేళ్ల నుంచి బృందావన్‌కు వెళ్లి వస్తున్నానని తెలిపాడు. బృందావన్‌లోని సుధ ఇంటికి వెళ్లి ఆమెను గ్వాలియర్ రావాల్సిందిగా పోలీసులు కోరగా.. భర్త దగ్గరకు వెళ్లేందుకు ఆమె నిరాకరించింది. తన భర్త అనుమానంతో వేధించేవాడని, ఆ వేధింపులు తట్టుకోలేకే పిల్లలతో కలిసి ఇల్లు వదిలి వచ్చినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. బృందావన్‌కు వెళ్లాక సుధ తన ఆధార్ కార్డులో భర్త పేరును సునీల్‌గా మార్చింది. తన ఇద్దరి పిల్లల పేర్లను కూడా మార్చేసింది. కూతురు దివ్య పేరును అర్పనగా, కొడుకు మంగల్ పేరును బల్జీత్ సింగ్‌గా మార్చేసింది. సునీల్‌ తమ తండ్రి అని ఇప్పటికీ పిల్లలు నమ్ముతున్నారంటే ఈ సునీల్, సుధ ఎంతలా అందరినీ బురిడీ కొట్టించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

First published:

Tags: Extra marital affair, Illicit affair, Married women, Women missing

ఉత్తమ కథలు