పదేళ్ల పాటు కాపురం చేసిన భర్తను, కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలను ప్రియుడి కోసం వదలుకుంది ఓ మహిళ. అతడితో ప్రేమాయణం సాగించి పెళ్లి కూడా చేసుకుంది. అయితే అసలు నిజం తెలియడంతో... ఇప్పుడు ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. తమిళనాడులోని నెల్లై జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని సేరన్ మహాదేవికి చెందిన వ్యక్తితో పాళయంకోటై కృష్ణాపురానికి చెందిన మహిళకి గత పదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 8 ఏళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. ఈ స్థితిలో ఒక్కటిన్నర సంవత్సరాల ముందు ఆ మహిళకి ఓ మిస్డ్ కాల్ వచ్చింది. కాయత్తార్‌కి చెందిన యువకుడితో పరిచయమై కాలక్రమేణా ప్రేమగా మారింది.
ప్రేమ మత్తులో ఉన్న ఆ మహిళ ఆ యువకుడి వద్ద తనకు వివాహం జరిగి పిల్లలు ఉన్నారనే విషయాన్ని దాచిపెట్టింది. ప్రియుడిని కలవడానికి వెళ్లినప్పుడు మంగళసూత్రాన్ని తీసేసి బ్యాగులో పెట్టుకుని ఊరు తిరిగింది. 29 ఏళ్ల ఆ మహిళ 24 ఏళ్ల యువకుడిని వివాహం చేసుకోవాలని భావించింది. అనంతరం ఆ మహిళ గత 20వ తేదీ నాగర్‌కోవిల్‌లో ఇంటర్వ్యూ అని భర్తకు చెప్పి వెళ్లింది. తరువాత ప్రియుడితో తెన్కాశి సమీపంలో సుందరపాండియన్ పురానికి వెళ్లిన ఆ మహిళ ప్రియుడి బంధువుల ముందు 24వ తేదీ వివాహం చేసుకుంది. ఈ విషయం తెలియని భర్త తన భార్య కనబడడం లేదని, భార్యను కనిపెట్టి ఇవ్వమని సేరన్ మహాదేవి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఫొటోని ఆ మహిళ తన ఫొన్లో స్టేటస్‌గా పెట్టింది.
దీన్ని ఆమె బంధువులు, కుటుంబీకులకు తెలిపిన అనంతరం వారు సేరాన్ మహాదేవి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు విచారణ చేయడంతో ఆ మహిళకు ముందుగానే వివాహం జరిగి పిల్లలు ఉన్నట్లు తెలిసింది. దీంతో మహిళను పెళ్లి చేసుకున్న ఆమె ప్రియుడు ఆమెను వదిలిపెట్టేందుకు సిద్ధమయ్యాడు. దీనిపై భర్త, బంధువులకు తెలిపితే వారు కూడా ఆమెను అంగీకరించలేదు. ఆమెను ఆ రోజు రాత్రి సేరన్ మహాదేవిలో ఉన్న కరోనా శిబిరంలో ఉంచారు. ఆ మరుసటి రోజు వచ్చిన భర్త, ప్రియుడి బంధువులెవరూ ఆమెను తీసుకెళ్లడానికి ముందుకు రాలేదు. దీంతో ఆమె విషయంలో ఏం చేయాలనే విషయం అధికారులకు అర్థంకావడం లేదు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.