భార్య తీరుతో విరక్తి.. ప్రియుడితోనే పో అంటూ మూడేళ్ల కూతురితో సహా ఇంట్లోంచి వెళ్లిపోయిన భర్త.. చివరకు జరిగిందో ఘోరం

ప్రతీకాత్మక చిత్రం

ఎన్నిసార్లు చెప్పినా భార్యలో మార్పు రాలేదు. ఆ భర్తకు విరక్తి వచ్చింది. అందుకే తన మూడేళ్ల కుమార్తెతో సహా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ప్రియుడి వద్దకే వెళ్లిపో అంటూ భార్యకు చెప్పి మరీ వేరుగా ఉండటం మొదలు పెట్టాడు. చివరకు..

 • Share this:
  భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి రాక వల్ల ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిజం తెలిసి భర్త చేతిలో భార్య హతం కావడమో, ప్రేయసి మోజులో ఉన్న భర్తను భార్యే కడతేర్చడమో జరుగుతున్నాయి. కొన్ని ఘటనల్లో తమ మధ్యలోకి వచ్చిన మూడో వ్యక్తిని భార్యాభర్తలే ప్లాన్ చేసి మరీ హత్య చేస్తున్నారు. తాజాగా వివాహేతర సంబంధం వల్ల జరిగిన ఓ దారుణం బయటపడింది. ఓ 26 ఏళ్ల కుర్రాడితో భార్య ఎఫైర్ నడుపుతోందని భర్తకు తెలిసింది. పలుమార్లు హెచ్చరించినా ప్రవర్తన మానుకోకపోవడంతో భర్తకు విసుగొచ్చింది. ప్రియుడి వద్దకే వెళ్లిపో అంటూ మూడేళ్ల కుమార్తెతో సహా వేరుగా ఉండటం మొదలు పెట్టాడు. ఆ భార్య చేసిన పొరపాటు వల్ల అయిదేళ్ల కుమార్తె ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

  తమిళనాడు రాష్ట్రంలోని విదునగర్ జిల్లా రాజపాళయంకు చెందిన ఓ యువతికి కొన్నాళ్ల క్రితమే పెళ్లయింది. ఆమెకు భర్త, ఐదేళ్లు, మూడేళ్ల వయసున్న కూతుళ్లు ఉన్నారు. అయితే ఆ యువతికి అదే గ్రామానికి చెందిన 26 ఏళ్ల అలెక్స్ అనే కుర్రాడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లుగా వీరి మధ్య వ్యవహారం గుట్టుగా జరుగుతోంది. అయితే ఆ విషయం కాస్తా భర్తకు తెలిసిపోయింది. భార్యను మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినప్పటికీ వినకపోవడంతో ఆ భర్తకు విరక్తి పుట్టింది. నువ్వు నీ ప్రియుడి దగ్గరకే వెళ్లిపో, అతడితోనే ఉండంటూ మూడేళ్ల కుమార్తెతో సహా వేరుగా ఉండటం మొదలు పెట్టాడు.

  తన తప్పేంటో తెలుసుకోవాల్సిన భార్య కాస్తా నేరుగా ప్రియుడి వద్దకు వెళ్లింది. అయిదేళ్ల కుమార్తె, ప్రియుడితో సహా కేరళ రాష్ట్రం వెళ్లిపోయింది. పత్తనంతిట్టా జిల్లాలో ఇల్లు అద్దెకు తీసుకుని మరీ ప్రియుడితో కలిసి ఉంటూ భార్యాభర్తలుగా చెలామణీ అవుతోంది. ఏప్రిల్ ఆరో తారీఖున ఆమె కూలి పనులకు వెళ్లింది. ఆ సమయంలో ఐదేళ్ల కుమార్తెను అలెక్స్ కు చూసుకోమని చెప్పింది. అయితే అలెక్స్ మాత్రం మద్యం, గంజాయి మత్తులో నీచానికి ఒడిగట్టాడు. ఐదేళ్ల పాపపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక వాంఛను తీర్చుకున్నాడు. కూలి పనుల నుంచి సాయంత్రం పూట తిరిగొచ్చిన తల్లి ఇంట్లో నిర్జీవంగా పడి ఉన్న కూతురిని చూసింది. అలెక్స్ అప్పటికే పరారీలో ఉండటం, ఫోన్ కూడా స్విచాఫ్ అని రావడంతో అతడి నిర్వాకమే అని పసిగట్టింది. ఆస్పత్రికి తీసుకెళ్తే అప్పటికే మరణించిందని తేల్చారు. ఈ ఘటనపై ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి పరారీలో ఉన్న అలెక్స్ ను పట్టుకున్నారు. అతడు నిజం ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి అతడిని రిమాండ్ కు విధించారు.
  Published by:Hasaan Kandula
  First published: