హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: మంత్రాలు చేస్తుందనే అనుమానం.. మహిళను బహిరంగంగా వివస్త్రను చేసి.. ఆ తర్వాత....

Shocking: మంత్రాలు చేస్తుందనే అనుమానం.. మహిళను బహిరంగంగా వివస్త్రను చేసి.. ఆ తర్వాత....

మహిళను కొడుతున్న స్థానికులు

మహిళను కొడుతున్న స్థానికులు

Maharashtra: మహారాష్ట్రలో అమానవీయకర సంఘటన జరిగింది. మంత్రాలు చేస్తుందనే అనుమానంతో ఓ మహిళ మీద కొందరు సభ్యసమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించారు. ఆమెను వివస్త్రను చేసి, నడి వీధుల్లో ఊరేగించారు.

Woman Labelled A Witch Stripped and Paraded Naked By Locals: ఒక మహిళను మంత్రాలు, చేతబడులు చేస్తుందనే అనుమానంతో  కొందరు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆమెను ఇంటిలో నుంచి బయటకు లాక్కొచ్చి వివస్త్రను చేశారు. అంతటితో ఆగకుండా ఆమెను చిత్ర హింసలకు గురిచేశారు. బహిరంగంగానే దాడికి పాల్పడ్డారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహరాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో ఓ మహిళ మంత్రగత్తె అనే అనుమానంతో స్థానిక ప్రజలు ఆమెను వివస్త్రను చేసి ఊరేగించారు. ఆమెపై పైశారిచీకంగా దాడి చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించారు.

ఈ ఘటనను కొందరు కెమెరాలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  దీంతో ఇది వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన అధికారులు  ఘటనపై విచారణ జరపాల్సిందిగా నందుర్బార్ లోని జిల్లా అధికారులను కోరారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది.

యూపీలో దళితుడిపట్ల అమానుషంగా ప్రవర్తించిన సంఘటన వార్తలలో నిలిచింది.

Uttar pradesh Dalit Boy Assaulted Forced To Lick Feet:  ప్రభుత్వాలు దళితులు, వెనుకబడిన వర్గాలను ప్రొత్సహించడం కోసం అనేక చట్టాలు, పథకాలు తీసుకొస్తున్నాయి. ఒకప్పుడు దళితులను పాఠశాలకు ప్రవేశించకుండా, నీళ్లను తాగకుండా, గ్రామాలకు దూరంగా వారిని ఉంచే వారు. కాల క్రమేణా అది మార్పు చెంది ప్రస్తుతం దళితులు తమకంటూ ప్రత్యేక స్థానం, సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇప్పటికి కొన్ని చోట్ల దళితులు వివక్షతను ఎదుర్కొంటున్న సంఘటనలు వార్తలలో నిలుస్తున్నాయి.  కొన్ని చోట్ల దళితులపై అమానుషకర సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. కొందరు అగ్రకులాల వారు.. ఇప్పటికి వారి ఆధీపత్యం ప్రదర్శించి, అమాయక ప్రజలను హింసిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

యూపీలోని రాయ్ బరేలీలో జరిగిన దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. యూపీలో కొందరు అగ్రవర్ణాల యువకుడు.. బైక్ మీద కూర్చుని, పేదలను నానా దుర్భాషలాడారు. బాధితుడిని మోకాలి మీద కూర్చోబెట్టి.. అతన చేత పాదాలు నొక్కించుకున్నారు. అంతటితో ఆగకుండా.. కాలును కూడా నాకాలని హుకుం జారీచేశారు. వారి బెదిరింపులకు భయపడిపోయిన సదరు బాధితుడు.. బైక్ మీద కూర్చున్న వ్యక్తి పాదాలు నాలుకతో తాకాడు. అక్కడే ఉన్న మిగతావారు.. బాధితుడు పరిస్థితిని అపహస్యం చేస్తు నవ్వుకున్నారు. ఆ తర్వాత.. అతను కాలిని నాకుతుండగా చుట్టు ఉన్న మిగతా వారు వీడియో తీస్తు పైశాచికానందం పొందారు.

First published:

Tags: Attack peoples, Crime news, Maharashtra

ఉత్తమ కథలు