హోమ్ /వార్తలు /క్రైమ్ /

అనంతపురంలో వివాహేతర సంబంధం.. ముగ్గురు పిల్లల్ని బావిలోకి తోసి చంపిన తల్లి..

అనంతపురంలో వివాహేతర సంబంధం.. ముగ్గురు పిల్లల్ని బావిలోకి తోసి చంపిన తల్లి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లల్ని బావిలోకి తోసేసి చంపిందో దుర్మార్గురాలు. ఈ అమానుష ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం పెద్ద కమ్మవారిపల్లిలో చోటుచేసుకుంది.

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లల్ని బావిలోకి తోసేసి చంపిందో దుర్మార్గురాలు. ఈ అమానుష ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం పెద్ద కమ్మవారిపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. గ్రామానికి చెందిన రమేశ్‌తో అరుణమ్మకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు. రమేశ్ తన బంధువు గురుబాబుతో కలిసి వ్యాపారం చేస్తున్నాడు. గురుబాబు తరచూ వీళ్లింటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో అరుణమ్మతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసిన రమేశ్.. తన భార్యను పుట్టింటికి పంపేశాడు. ఇదే అదనుగా తీసుకొన్న గురుబాబు.. తనతో సంబంధం కొనసాగించాలని అరుణమ్మపై ఒత్తిడి తెచ్చాడు. అతడి ఒత్తిడికి తలొగ్గి.. అతడితో ఉండేందుకు ఒప్పుకుంది.

ఈ క్రమంలో తన సంబంధానికి అడ్డుగా ఉన్నారని చెప్పి.. కన్నబిడ్డలనే చంపాలని ప్లాన్ వేసింది. ఆదివారం రాత్రి పొలం బావి వద్దకు తన బిడ్డల్ని తీసుకెళ్లి.. అందులోకి వాళ్లను తోసేసింది. అర్ధరాత్రి ఒంటరిగా ఇంటివైపు వస్తుండగా చూసిన గ్రామస్తులు ఆమెను నిలదీయగా.. భయపడి తాను కూడా బావిలోకి దూకేసింది. వెంటనే ఆమె ప్రాణాలను కాపాడారు. అయితే, అప్పటికే ముగ్గురు పిల్లలు జీవచ్ఛవాలుగా మారారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసుల.. నిందితురాలు, ఆమె భర్త రమేశ్, గురుబాబు, గురుబాబు భార్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

First published:

Tags: Anantapur S01p19, Anantapuram, AP News, Crime, Illicit affair, Illicit relationship

ఉత్తమ కథలు