• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • WOMAN KILLS SELF AFTER UPSET ABOUT PET DOG DEATH IN CHHATTISGARH SU

పెంపుడు కుక్క మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య.. అక్కడే పాతిపెట్టాలని సూసైడ్ నోట్

పెంపుడు కుక్క మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య.. అక్కడే పాతిపెట్టాలని సూసైడ్ నోట్

ప్రతీకాత్మక చిత్రం

పెంపుడు కుక్క మరణాన్ని తట్టుకోలేని ఆమె తన ప్రాణాలను తీసుకుంది. ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.

  • Share this:
    ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో పెట్ డాగ్స్ ఉండటం కామన్‌గా మారిపోయింది. కొందరైతే పెంపుడు కుక్కలను చాలా ఇష్టంగా చూసుకుంటారు. వాటిని తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తారు. అప్యాయంగా దగ్గరికి తీసుకుని ఆహారం తినిపిస్తారు. ప్రేమ ఎక్కువైతే వాటిపై ముద్దుల వర్షం కురిపిస్తారు. అయితే పెంపుడు కుక్క మీద ఉన్న ప్రేమ ఓ యువతి ఆత్మహత్యకు దారితీసింది. పెంపుడు కుక్క మరణాన్ని తట్టుకోలేని ఆమె తన ప్రాణాలను తీసుకుంది. ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ప్రియాంషు సింగ్ అనే యువతి పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతోంది. కోట్రా రోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోర్ఖా ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. అయితే ఆమె ప్రేమగా పెంచుకున్న నాలుగేళ్ల పెంపుడు కుక్క అనారోగ్యంతో మంగళవారం రాత్రి మరణించింది. అయితే దాన్ని మరణాన్ని ప్రియాంషు జీర్ణించుకోలేకపోయింది.

    కుక్క అంత్యక్రియలు పూర్తి చేశాక తాను కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లాలని ప్రియాంషు నిర్ణయించుకోంది. ఈ క్రమంలోనే ఇంట్లోని ఐరన్ పైప్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరుసటి రోజు ఉదయం ప్రియాంషు ఉరికి వేలాడుతూ ఉండటాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. ఇందుకు సంబంధించి పోలీసులు సమాచారం అందజేశారు. ఘటనస్థలానికి చేరుకున్న వివరాలు సేకరించారు. ప్రియాంషు రాసిన ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    తన పెట్ డాగ్‌ను పాతిపెట్టిన చోటే తన అంత్యక్రియలు కూడా నిర్వహించాలని ప్రియాంష్ ఆ లేఖలో పేర్కొందని పోలీసులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని వెల్లడించారు.
    Published by:Sumanth Kanukula
    First published: