సోదరుడితో మహిళ అక్రమ సంబంధం...అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను...దారుణం...

నవీనకు వరుసకు అన్నయ్య అవుతాడు. కానీ కామంతో కళ్లుమూసుకుపోయిన వారికి వావి వరుసలు తెలియలేదు. మహేష్ తో నవీన అక్రమసంబంధం పెట్టుకుంది.

news18-telugu
Updated: May 26, 2020, 12:25 AM IST
సోదరుడితో మహిళ అక్రమ సంబంధం...అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను...దారుణం...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
మన సమాజంలో అక్రమ సంబంధాలు కుటుంబాలను కూల్చేస్తున్నారు. అన్నవరసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని, దానికోసం సొంత భర్త ప్రాణాలనే తీసింది ఓ ప్రబుద్ధురాలు. బీహార్ లోని చంపారన్ జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన. మృతుడు నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. ఒక వారం క్రితమే లాక్ డౌన్ కారణంగా భార్య నవీన, కొడుకుతో గ్రామానికి వచ్చాడు. వీరి ఇంటిపక్కనే ఉన్న మహేష్ అనే ఓ వ్యక్తి నివాసముంటున్నాడు. అతడు నవీనకు వరుసకు అన్నయ్య అవుతాడు. కానీ కామంతో కళ్లుమూసుకుపోయిన వారికి వావి వరుసలు తెలియలేదు. మహేష్ తో నవీన అక్రమసంబంధం పెట్టుకుంది. దీనికోసం ఎలాగైనా తన భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. దీనికి మహేష్ కూడా సాయం చేశాడు. దీంతో గతవారం తెల్లవారుజామున నవీన అత్యంత పాశవికంగా తన భర్త గొంతు కోసి చంపేసింది.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు అనుమానం రావడంతో నవీనను అరెస్టు చేశారు. అయితే ఆమె ప్రియుడు మహేష్ మాత్రం పరారీలో ఉన్నాడు. మహేష్ ను త్వరలో పట్టుకుంటామని, అయితే హత్యకు ఉపయోగించిన ఆయుధం ఇంకా దొరకలేదని, త్వరలోనే దానిని చేజిక్కించుకుంటామని తెలిపారు.
First published: May 26, 2020, 12:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading