హోమ్ /వార్తలు /క్రైమ్ /

Kolhapur : భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య.. కట్టుకథతో పోలీసులకూ చుక్కలు.. చివరికి ఏమైందంటే..

Kolhapur : భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య.. కట్టుకథతో పోలీసులకూ చుక్కలు.. చివరికి ఏమైందంటే..

నిందితురాలు వందన, హతుడు ప్రకాశ్ (పాత ఫొటోలు)

నిందితురాలు వందన, హతుడు ప్రకాశ్ (పాత ఫొటోలు)

ఓ ఇల్లాలు భర్త మర్మాంగాన్ని కోసేసి దారుణంగా హత్య చేసింది. కానీ తానే వెళ్లి పోలీసులకు మరోలా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం అటాప్సీలోగానీ బయటపడలేదు. స్థానిక పోలీసులు చెప్పిన వివరాలివి..

కారణాలు వేరైనప్పటికీ భార్యల చేతుల్లో భర్తలు హతమవుతోన్న ఉదంతాలు ఇటీవల పెరిగిపోయాయి. ఇష్టంలేని పెళ్లి కుదిర్చారనే సాకుతో అమ్మాయిలు.. కొత్త పెళ్లికొడుకుల పీకలు తెగ్గోసిన కేసులు తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకోగా, ఇప్పుడు మహారాష్ట్రలో ఓ ఇల్లాలు భర్త మర్మాంగాన్ని కోసేసి దారుణంగా హత్య చేసింది. కానీ తానే వెళ్లి పోలీసులకు మరోలా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం అటాప్సీలోగానీ బయటపడలేదు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి షాహూవాడీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ పాటిల్ చెప్పిన వెల్లడించిన వివరాలివి..

మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లా షాహూవాడీ తాలూకా నంద్‌గావ్ ప్రాంతంలోని మంగుర్‌వాడి గ్రామానికి చెందిన మయాత్ ప్రకాశ్ పాండురంగ్ కాంబ్లే(52), వందనా ప్రకాశ్ కాంబ్లే(50) భార్యభర్తలు. భూమిలేని పేదలు కావడంతో కూలీనాలి చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ప్రకాశ్ కొన్నేళ్లుగా మద్యానికి బానిసై భార్యను తరచూ హింసించేవాడు. కొద్ది నెలలుగా ఈ దంపతులు ఓ ఫామ్ హౌజులో వార్షీక కూలీలుగా పనిలో కుదిరారు. అక్కడ పనిచేస్తున్నప్పటి నుంచి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు ప్రకాశ్..

CM KCR | Centre: భారీ షాక్.. టీఎస్ ప్రాజెక్టులు, పథకాలకు కేంద్రం, ఆర్బీఐ బ్రేక్! -అప్పులపై కోర్టుకు కేసీఆర్?


ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకున్నావంటూ భార్య వందనను ప్రకాశ్ హింసించడం, రోజూ తాగొచ్చి కొట్టడం నిత్యకృత్యంగా మారింది. హింస భరించలేని స్థితిలో మొన్న సోమవారం రాత్రి భర్తపై తిరుగుబాటు చేసింది వందన. మద్యం మత్తులో జోగుతూ కొడుతోన్న భర్తను అడ్డుకొని అవతలికి తోసేసింది. భార్య చర్యకు ప్రకాశ్ బిత్తరపోయి ఉండగానే బయటి నుంచి బండరాయి తీసుకొచ్చి అతని తలపై బలంగా కొట్టింది. ఆ దెబ్బకు ప్రకాశ్ కిందపడిపోయినా, ఆమెలోని కసి చల్లారలేదు. ఇంట్లోనే ఉన్న కత్తి తీసుకొని భర్త మర్మాంగాన్ని కోసేసింది వందన. ఆపై..

CM KCR మెడపై బీసీ కత్తి! -AP CM Jagan ఆర్.కృష్ణయ్య బాణంతో గులాబీ లెక్కలు తారుమారు?


భర్తను హతమార్చిన తర్వాత వందన ఆరోజు రాత్రే నేరుగా షాహూవాడీ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. మద్యం మత్తులో భర్త అఘాయిత్యానికి పాల్పడ్డాడని, కత్తితో తానే కోసుకొని, తలను బండకేసి బాదుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె ఫిర్యాదు ఇచ్చింది. ఘటనా స్థిలికి వెళ్లిన పోలీసులు.. ప్రకాశ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మల్కాపూర్‌ ఆస్పత్రికి తరలించారు. అటాప్సీ రిపోర్టులో డాక్టర్లు దీనిని హత్యగా అనుమానించారు. దీంతో పోలీసులు వందనను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా చివరికి ఆమె నేరాన్ని అంగీకరించింది. వందనపై కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.

First published:

Tags: Crime news, Maharashtra, Wife kills husband

ఉత్తమ కథలు