హోమ్ /వార్తలు /క్రైమ్ /

Affair: యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. కానీ ఆ పని చేయడం ఆమెకు నచ్చలేదు.. చివరకు..

Affair: యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. కానీ ఆ పని చేయడం ఆమెకు నచ్చలేదు.. చివరకు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మృతుడి గురించి వివరాలు తెలియగానే.. అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళపై పోలీసులు దృష్టి పెట్టారు.

నోయిడా: కొద్ది రోజుల క్రితం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతడి తలపై ఎవరో కత్తితో పొడిచారు. హత్య విషయం తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన ఐదో రోజు హత్య మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు తల్లీకూతుళ్లు కావడం గమనార్హం. కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు తల్లీ కూతుళ్లను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు మిలేకిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని, కొన్ని ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన నవంబర్ 19 రాత్రి నోయిడా నగరం సమీపంలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడికి నిందితురాలైన మహిళతో వివాహేతర సంబంధం ఉంది. తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడికి.. ఆమె కూతురిపై కూడా ఆసక్తి పెరిగింది. యువతిపై చులకన భావం ఏర్పడింది. నిందితుడు ఆమెను ఎప్పుడూ ఆటపట్టించేవాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి.. ఈ విషయంలో తన ప్రియుడిని పలుమార్లు హెచ్చరించింది. ఈ రకంగా చేయొద్దని అతడికి చెప్పుకొచ్చింది. కానీ అతని ప్రవర్తనలో తేడా లేదు. దీనికి తోడు తన కుమార్తెతోనూ సంబంధం పెట్టుకునేందుకు ప్రియుడు ప్రయత్నించడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది.

దీంతో సదరు మహిళ తన కుమార్తెతో కలిసి కుట్ర పన్ని తన ప్రియుడిని హతమార్చేందుకు పథకం వేసింది. అలా అతడిని చంపింది. నిందితురాలు అంతకుముందు మృతుడిని కత్తితో పొడిచి, ఇటుకలతో తలను చితకబాదిందిజ అనంతరం మరణించిన యువకుడి మృతదేహాన్ని నోయిడా ఎక్స్‌టెన్షన్ ఏరియాలోని ప్రాంతంలో పడేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, ఘటనకు సంబంధించిన ఆధారాలు లభించాయి. మృతుడి గురించి వివరాలు తెలియగానే.. అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళపై పోలీసులు దృష్టి పెట్టారు.

Lizards: బల్లులతో ప్రమాదం.. వాటిని ఇంట్లో నుంచి తరిమేయండి ఇలా..

Walking: వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు.. అదే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి

కీలక పదవి ఆ ముగ్గురిలో ఎవరికి ? KCR మనసులో ఉన్నదెవరు..? ట్విస్ట్ ఉంటుందా ?

Banana: అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతాయా ?.. ఇందులో నిజమెంత ?

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నిందితురాలు తాను చేసిన నేరాన్ని అంగీకరించింది. మృతుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌బుక్, మొబైల్‌తో పాటు హత్యకు ఉపయోగించిన కత్తి, ఇటుకను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన రోజు నిందితులు ధరించిన దుస్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోగా, వారిపై రక్తపు మరకలు కనిపించాయి. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Crime news, Illegal affair

ఉత్తమ కథలు