నాలుగేళ్లుగా సాగిన అక్రమ సంబంధం బయటపడటంతో దారుణానికి ఒడిగట్టింది ఓ మహిళ. ప్రియుడిని విడి ఉండలేను అనుకుందేమో కానీ లోకం తెలియని చిన్నారుల ప్రాణాలు తీయాలని నిర్ణయించుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా సదుం మండలం చింతపర్తిపల్లెలోని నడిమోడు నీటి గుంట వద్ద చోటు చేసుకుంది. రామిరెడ్డి వారే పల్లెకు చెందిన హేమశ్రీకి పెళ్లై 10 నెలల కవలపిల్లలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్ అనే వ్యక్తితో గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇది తెలిసిన కుటుంబ సభ్యులు అక్రమ సంబంధంపై హేమశ్రీని ప్రశ్నించారు. ఇలా చేయడం తప్పని మందలించారు. వివాహేతర సంబంధం మానుకోవాలని హెచ్చరించారు.
దీంతో ప్రియుడు ఉదయ్‌కి సమాచారం అందించింది హేమశ్రీ. ఒకరిని విడి మరొకరు జీవించలేము అనే స్థితిలో ఉన్న ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రియుడు ఉదయ్ కుమార్, హేమశ్రీ ఇద్దరు చిన్నారులతో కలసి సదుం మండలంలో చింతపర్తిపల్లెలోగల నడిమోడు నీటి కుంట వద్దకు చేరుకున్నారు. ముందుగా హేమశ్రీ, ఉదయ్‌లు విషం తాగారు. అనంతరం చిన్నారులను నీటి కుంటలో పడేశారు. పసి మొగ్గలు కావడంతో నీటి కుంటలో పడ్డ 10 నిమిషాలకే కవలలు మృతి చెందారు. నీటి కుంట గట్టుపై అపస్మారక స్థితిలో పడి ఉన్న హేమశ్రీ, ఉదయ్‌లను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.