కడపలో సంచలనం సృష్టించిన మూడేళ్ల బాలుడు అశ్రిత్ హత్య కేసు (Kadapa boy murder case)ను చిన్నచౌకు పోలీసులు చేధించారు. సొంత మేనత్తే ఆ బాలుడిని హత్య చేసినట్లు వెల్లడించారు. గతంలో తన ప్రేమను అంగీకరించలేదని అన్నపై కోపం పెంచుకున్న ఆమె.. ఈ క్రమంలోనే అతడి కుమారుడిని కిరాతకంగా హత్య చేసినట్లు తెలిపారు. కడప అదనపు ఎస్.పి(అడ్మిన్) తుషార్ డూడి చెప్పిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా కోనాపురం గ్రామానికి చెందిన వెలగచెర్ల శివకుమార్, భాగ్యలక్ష్మి దంపతులు కువైట్‌లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రులు కువైట్‌లో ఉండడంతో.. పిల్లలు నానమ్మ, తాతయ్యల దగ్గర ఉండి చదువుకుంటున్నారు.
అశ్రిత్ మరణించడంతో భార్యాభర్తలు ఎంతో భయపడ్డారు. తాము చేయరాని తప్పు చేశామని, ఆశ్రిత్ చనిపోయాడని ఇంద్రజ తన అన్నకి వాట్సప్‌లో వాయిస్ మెసేజ్ పెట్టి.. సెల్ ఫోన్ స్విచాఫ్ చేసింది. అనంతరం భర్త, కూతురుతో కలిసి పరారయింది. వాట్సప్‌లో వాయిస్ మెసేజ్ విని.. వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు శివకుమార్. వారు కడప రిమ్స్‌కి చేరుకొని.. బాలుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి నానమ్మ, తాతయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలించారు. పోలీసుల బృందాలు గాలిస్తున్నాయని తెలుసుకొని.. వారే కడప డిప్యూటీ తహశీల్దార్ వద్ద లొంగిపోయారు. నాలుగు రోజుల వ్యవధిలోనే కేసును ఎస్పీ తుషార్ అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Kadapa