Home /News /crime /

WOMAN KILLS HER LOVER IN MEERPET OF HYDERABAD WITH TWO OTHERS TRIED TO SHOW IT AS ACCIDENT AK

Hyderabad: ప్రియుడిని చంపిన మహిళ.. హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించే కుట్ర.. చివరకు..

నిందితురాలు శ్వేతారెడ్డి (ఫైల్ ఫోటో)

నిందితురాలు శ్వేతారెడ్డి (ఫైల్ ఫోటో)

శ్వేతారెడ్డితో పాటు ఈ హత్యకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

    హైదరాబాద్ (Hyderabad) మీర్‌పేట్‌లో దారుణం చోటు చేసుకుంది. తన స్నేహితులతో కలిసి ప్రియుడు యశ్విన్‌ను ప్రియురాలు శ్వేతారెడ్డి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ప్రేమించుకున్న సమయంలో తీసిన వీడియోలను బయటపెడతానంటూ తన ప్రియురాలు శ్వేతారెడ్డిని యశ్విన్ బెదిరించడం మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను కుటుంబసభ్యులకు పంపి ఇబ్బందులకు గురి చేశాడు. వివాహం చేసుకోవాలని శ్వేతా రెడ్డిపై ఒత్తిడి చేశాడు. దీంతో అతడి వేధింపులు భరించలేకపోయిన శ్వేతారెడ్డి..తన స్నేహితులతో కలిసి యశ్విన్‌ను హత్య చేసింది.

    యశ్విన్‌కు హత్య చేసి.. దానిని యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. ఈ నెల 4న అతడిని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పారిపోయింది శ్వేతారెడ్డి. ఆ తరువాత స్థానికులు యశ్విన్‌ను ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన యశ్విన్.. ఈ నెల 6న చనిపోయాడు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. మీర్‌పేట్‌లో (Meerpet)నిందితుడు గాయపడిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన అనంతరం.. అతడిని హత్యగా నిర్ధారణకు వచ్చారు.

    ఆ తరువాత శ్వేతారెడ్డితో పాటు ఈ హత్యకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది.

    Honey trap: మరోసారి హనీ ట్రాప్ కలకలం.. భారత్ వైమానిక దళ అధికారి అరెస్టు..

    Shocking: గోవాలో అమానుషం.. రష్యన్ బాలికను హోటల్ గదిలోకి తీసుకెళ్లి..

    ఫేస్‌బుక్‌ ద్వారా కొన్నేళ్ల క్రితం యశ్విన్ పరిచయం కావడంతో.. శ్వేతారెడ్డి కొంతకాలంగా అతడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని పోలీసుల విచారణలో తేలినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు