Home /News /crime /

WOMAN KILLS HER HUSBAND WITH THE HELP OF LOVER IN PRAKASAM DISTRICT AK

ప్రియుడి కోసం భర్త హత్య...పక్కా ప్లాన్...ఆరు నెలల తరువాత...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ మహిళ. ఆరు నెలల తరువాత ఈ హత్య కేసు మిస్టరీ వెలుగులోకి వచ్చింది.

    ప్రియుడితో జీవితం గడిపేందుకు ఏకంగా కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఓ మహిళ. పక్కా ప్లాన్ ప్రకారం భర్తను హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా చేసింది. అయితే నిజం ఎక్కువకాలం దాగలేదు. కోడలి తీరుపై అనుమానం వచ్చిన మృతుడి మామ... పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మర్డర్ మిస్టరీ బయటకు వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం...ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేటకు చెందిన కడియాల చంద్రశేఖర్‌ ఆచారి మూడేళ్ల నుంచి ప్రొద్దుటూరులోని అమృతానగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య మహాలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రొద్దుటూరులో కార్పెంటర్‌ పనికి వెళుతూ భార్యా, పిల్లలను పోషించేవాడు.

    ఈ క్రమంలో గత ఏడాది అక్టోబర్‌ 28న చంద్రశేఖర్‌ ఆచారి చనిపోయాడు. ఈ విషయాన్ని మహాలక్ష్మి తన అత్తా మామలకు తెలిపి మృతదేహాన్ని స్వగ్రామమైన సంజీవరాయునిపేటకు తరలించింది. చంద్రశేఖర్‌ ఆచారి తల్లిదండ్రులు, మహాలక్ష్మి బంధువులు కలిసి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. రెండు నెలల పాటు గ్రామంలో ఉన్న మహాలక్ష్మి తర్వాత కనిపించలేదు. మహాలక్ష్మి రామకృష్ణ ఆచారి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు మృతుడి బంధువులు గమనించారు. దీంతో మహాలక్ష్మీ చంద్రశేఖర్‌ను హత్య చేసి ఉంటుందనే అనుమానం వారిలో బలపడింది.

    దీనిపై కొన్ని రోజుల తర్వాత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్‌ ఆచారి శవానికి పోలీసులు పంచనామా నిర్వహించారు. ఈ సంఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంలో మర్డర్ మిస్టరీ వీడింది.చంద్రశేఖర్‌ ఆచారిని అడ్డు తొలగించాలనే ఉద్దేశంతోనే గత ఏడాది అక్టోబర్‌ 28న అర్ధరాత్రి హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతను నిద్రిస్తున్న సమయంలో రామకృష్ణ ఆచారి, మహాలక్ష్మిలు మురళీ అనే వ్యక్తితో కలిసి దిండు మొహంపై పెట్టి చంపేసినట్లు అంగీకరించారు. దీంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.




    First published:

    Tags: Crime, Illegal affairs, Prakasham dist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు