వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ ప్రియుడుతో కలిసి అన్నను హత్య చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని బేతపూడి పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపినవివరాలు.. బేతపూడి పరిధిలోని రేగులగడ్డకు చెందిన గంజి సాంబయ్య, నాగమ్మ దంపతులకు కుమారుడు పోతురాజు, కూతరు ఆదిలక్మి ఉన్నారు. పోతురాజుకు గార్లపాడుకు చెందిన మహిళతో వివాహమైంది. అయితే పోతురాజు తాగుడుకు బానిసగా మారడంతో.. ఆమె అతని వదిలేసింది. అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటుంది. ఇక, ఆదిలక్ష్మికి తిరులకొండకు చెందిన నాగరాజుతో వివాహం జరిగింది. అయితే వారి మధ్య మనస్పర్ధలు రావడంతో.. ఆదిలక్ష్మి కూడా ఇంటి వద్దే ఉంటుంది. అయితే ఇంటి వద్ద ఉంటున్న ఆదిలక్ష్మికి అదే గ్రామానికి చెందిన సాంబయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ విషయం పోతురాజుకు తెలియడంతో.. ఇంట్లో నుంచి వళ్లిపోవాలని ఆదిలక్ష్మిపై ఒత్తిడి చేశాడు. ఇలా పలుమార్లు ఆమెను ఇంటి నుంచి వెళ్లిపోవాలని అనేవాడు. అలాగే ఆస్తి తనకే ఇవ్వాలంటూ ఇంట్లో వాళ్లను బెదిరించేవాడు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 19వ తేదీన పోతురాజు మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. ఎప్పటిలాగే ఆస్తి కోసం ఇంట్లో వాళ్లతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో పోతురాజుకు, సాంబయ్యకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ సమయంలో పోతురాజు కిందపడటంతో అతని తలకు గాయమైంది.
అనంతరం పోతురాజు తమను ఏమైనా చేస్తాడమోనన్న భయంతో ఆదిలక్ష్మి, సాంబయ్య.. అతన్ని అంతమొందించాలని చూశారు. అందరు నిద్రిస్తున్న సమయంలో.. పోతురాజు తలపై ఆదిలక్ష్మి రోకలితో కొట్టింది. దీంతో పోతురాజు మరణించాడు. ఇక, అన్నను చంపినందుకు ఆదిలక్ష్మిని, ఆమెకు సహకరించినందుకు సాంబయ్యను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వారిని రిమాండ్కు తరలించినట్టు తెలిపారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.