హోమ్ /వార్తలు /క్రైమ్ /

Telangana: పెళ్లయిన కొద్ది రోజుల్లోనే భర్తకు కటీఫ్.. అదే ఊళ్లో కుర్రాడితో ప్రేమ పెళ్లి.. పాప పుట్టిన ఆరు నెలలకే ఆమె చేసిన నీచమిది..!

Telangana: పెళ్లయిన కొద్ది రోజుల్లోనే భర్తకు కటీఫ్.. అదే ఊళ్లో కుర్రాడితో ప్రేమ పెళ్లి.. పాప పుట్టిన ఆరు నెలలకే ఆమె చేసిన నీచమిది..!

కూతురితో భారతి (ఫైల్ ఫొటో)

కూతురితో భారతి (ఫైల్ ఫొటో)

పెద్ద చదువులు చదువుకున్నా మూఢనమ్మకాలను మాత్రం ఇంకా కొందరు పాటిస్తూనే ఉన్నారు. మదనపల్లిలో ఇటీవల జరిగిన ఓ దారుణం లాంటిదే సూర్యాపేటలోనూ జరిగింది. కన్న తల్లే ఆరు నెలల వయసున్న కూతురిని..

ఆ యువతి బీఎస్సీ బీఈడీ చదివింది. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అయింది. ఆ తర్వాత పెళ్లి అవడంతో సంసార బాధ్యతలను మోస్తోంది. ఉన్నత చదువులు చదివినప్పటికీ ఆమెకు ఉన్న మూఢనమ్మకాలు మాత్రం ఇంకా పోలేదు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఎలాంటి సీన్ అయితే రిపీట్ అయిందో, అచ్చం అదే సీన్ తెలంగాణలోనూ రిపీట్ అయింది. కన్న కూతుళ్లను ఆ ఇద్దరు తల్లిదండ్రులు చంపినట్టుగా ఇక్కడ కూడా ఓ తల్లి ఆరు నెలల వయసున్న తన కూతురిని అత్యంత దారుణంగా కడతేర్చింది. ఆపై ఏమీ ఎరుగనట్టు మృతదేహాన్ని ఇంట్లోనే వదిలేసి పుట్టింటికి వెళ్లింది. పాప ఏదని ఆ యువతి తల్లి అడిగితే సంబంధం లేని మాటలన్నీ చెబుతోంది. దీంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూస్తే ఘోరం బయటపడింది. సూర్యాపేటలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సూర్యాపేట జిల్లా మోతె మండలం మేకలపాటి తండాకు చెందిన బానోత్ భారతి అనే యువతికి ఎనిమిదేళ్ల క్రితమే ఓ వ్యక్తితో పెళ్లయింది. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. దీంతో ఆమె తన పుట్టింట్లోనే ఉంటోంది. రెండేళ్ల క్రితం అదే తండాకు చెందిన కృష్ణ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నారు. పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోని సమయంలో ఆత్మహత్యాయత్నం చేసి మరీ పెళ్లికి ఒప్పించింది. ఆరు నెలల క్రితం భారతి కృష్ణ దంపతులకు రీతూ అనే కూతురు పుట్టింతి. భారతి కొంత కాలంగా యూట్యూబ్ లో ఆథ్యాత్మిక వీడియోలను ఎక్కువగా చూస్తుంటుంది. నమ్మకాలు కూడా బాగా ఎక్కువ. ఇటీవల ఆ ఊరికి వచ్చిన ఓ సాధువు ఆమెకు నాగ దోషం ఉందని చెప్పినట్టు ఇతరులతో చెప్పింది. ఈ క్రమంలనే కొద్ది రోజులుగా ఇంట్లో పూజలు చేస్తోంది.

ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

గురువారం భర్త పనిమీద సూర్యాపేటకు వెళ్లాడు. అత్తమామలు పొలం పనులకు వెళ్లారు. ఇంట్లో తన ఆరు నెలల కూతురితోపాటు భారతి మాత్రమే ఉంది. ఆ పసికందును దేవుడి పటాల ముందు పడుకోబెట్టి గొంతును కోసి చంపేసింది. ఆ తర్వాత అదే తండాలోని దగ్గరలో ఉన్న తన తల్లిగారింటికి వెళ్లింది. పాప ఏది అని భారతి తల్లి అడిగింది. అయితే ఆమె సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో నేరుగా వాళ్లింటికి వెళ్లింది. అక్కడ రక్తపు మడుగులో ఉన్న చిన్నారిని చూసి దిగ్భ్రాంతి చెందింది. అప్పటికే ఆమె మరణించిందని గ్రహించి తీవ్రంగా రోదించింది. జరిగింది తెలిసి స్థానికులు లబోదిబోమన్నారు. అత్తమామలు, భర్త కూడా వెంటనే ఇంటికి చేరుకున్నారు. భారతిపై స్థానికులు దాడి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..

First published:

Tags: Crime news, Crime story, CYBER CRIME, Hyderabad, Suryapet, Telangana

ఉత్తమ కథలు