చెల్లెలి భర్తపై కన్నేసి...కట్టుకున్న భర్తను కడతేర్చిన వివాహిత...

కుంకుమ్ మాత్రం తన సోదరి భర్త ధీరజ్ పై మనసు పారేసుకుంది. అతనితో చనువుగా ఉండటం ప్రారంభించింది. అంతేకాదు ఏకంగా వివాహేతర బంధం పెట్టుకునేంత స్థాయికి దిగజారింది. ఇదంతా గమనించిన భర్త రంజిత్ తన భార్యను మందలించాడు.

news18-telugu
Updated: August 18, 2019, 6:47 PM IST
చెల్లెలి భర్తపై కన్నేసి...కట్టుకున్న భర్తను కడతేర్చిన వివాహిత...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వరుసకు మరిది అయిన, చెల్లెలి భర్తపై ఓ మహిళ మోజు పెంచుకుంది. అతడితో ఎలాగైన కలిసి తన కోరిక తీర్చుకోవాలనుకుంది. అందుకు అడ్డుగా ఉన్న భర్తను సైతం హత్య చేసేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ లోని బడోహీ జిల్లాలో కుంకుమ్ అనే మహిళ ఇటీవలే రంజిత్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే కుంకుమ్ మాత్రం తన సోదరి భర్త ధీరజ్ పై మనసు పారేసుకుంది. అతనితో చనువుగా ఉండటం ప్రారంభించింది. అంతేకాదు ఏకంగా వివాహేతర బంధం పెట్టుకునేంత స్థాయికి దిగజారింది. ఇదంతా గమనించిన భర్త రంజిత్ తన భార్యను మందలించాడు. అతడితో మరోసారి కనిపిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాడు. దీంతో కుంకుమ్ తన భర్తను ఎలాగైనా అడ్డుతప్పించాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే పుట్టింటికి వెళ్లి తండ్రి, సోదరులకు కట్టుకథలు చెప్పింది. భర్తను అడ్డుతొలగించాలని కుట్ర పన్నింది. అంతే ఇంటికి వచ్చిన భర్తను సోదరుల సహాయంతో తలపై రాడ్డుతో తీవ్రంగా గాయపరిచింది. అక్కడికక్కడే అతడు రక్తపు మడుగులో చనిపోయాడు.

అనంతరం పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసుకొని విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. కట్టుకున్న భార్యే నిందితురాలని తేలడంతో ఆమెతో పాటు హత్యకు బాధ్యులైన నిందితురాలి సోదరులు, తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు