బాయ్‌ఫ్రెండ్‌తో నగ్నంగా బెడ్రూంలో దొరికిపోయిన భార్యను చూసి...భర్త తట్టుకోలేక...

రోజీ తరచూ తన సోదరి ఇంటికి వెళుతున్నాను అని అబద్ధం చెప్పి ప్రదీప్ ఉంటున్న ఫ్లాట్ లో దూరేది. ఇద్దరూ కలిసి పడక సుఖం పొందేవారు. పీటర్ కు అనుమానం రాకుండా శృంగారంలో తేలియాడేవారు.

news18-telugu
Updated: August 9, 2020, 6:37 PM IST
బాయ్‌ఫ్రెండ్‌తో నగ్నంగా బెడ్రూంలో దొరికిపోయిన భార్యను చూసి...భర్త తట్టుకోలేక...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
వివాహేతర బంధాల మోజులో పడి ఆలు మగలు విచక్షణ కోల్పోతున్నారు. తన చీకటి బంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను హత్య చేసి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే కోల్ కతాలోని దుర్గానగర్ లో నివాసం ఉండే పీటర్ ( పేరు మార్చాం) తన భార్య రోజీ ( పేరు మార్చాం) తో కలిసి మూడేళ్లుగా స్థానిక అపార్టు మెంటులో నివాసం ఉంటున్నాడు. అయితే అదే అపార్టు మెంటులో ఉండే ప్రదీప్( పేరు మార్చాం) పీటర్ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవాడు. పీటర్ ఫ్యామిలీ కోల్ కతాకు తరలి వచ్చినప్పటి నుంచి ప్రదీప్ వారికి సహాయం చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే పీటర్ భార్య రోజీతో ప్రదీప్ సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టాడు. చివరకు ప్రదీప్, రోజీ మధ్య స్నేహం కాస్తా వివాహేతర బంధంగా మారింది. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేవారు. రోజీ తరచూ తన సోదరి ఇంటికి వెళుతున్నాను అని అబద్ధం చెప్పి ప్రదీప్ ఉంటున్న ఫ్లాట్ లో దూరేది. ఇద్దరూ కలిసి పడక సుఖం పొందేవారు. పీటర్ కు అనుమానం రాకుండా శృంగారంలో తేలియాడేవారు. ఓ రోజు రోజీ రహస్యంగా ప్రదీప్ ఫ్లాట్ లోకి వెళుతుండటం గమనించిన పీటర్ తన భార్యను నిలదీశాడు. అయితే ప్రదీప్ కు ఆరోగ్యం బాగోలేదని అందుకే చూడటానికి వెళ్లానని సర్ది పుచ్చింది. అయితే పీటర్ కు మాత్రం అనుమానం కాస్తా పెనుభూతంగా మారింది.

ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారనే సంగతిని పీటర్ గమనించాడు. దీంతో వెంటనే రోజీని నిలదీశాడు. అయినా రోజీ అతడి ఆరోపణలను తోసి పుచ్చింది. అయితే అపార్టుమెంటులో అయితే కుదరడం లేదని, ఇద్దరు ప్రియులు కలిసి ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్ లో కలవడం మొదలు పెట్టారు. పీటర్ గత వారం రోజీని వెంబడించి గెస్ట్ హౌస్ కు వరకూ వెళ్లాడు. అక్కడ రోజీ, ప్రదీప్ తో కలిసి గదిలోకి దూరడం చూశాడు. అంతే గది తలుపులు కొట్టి బలవంతంగా లోపలికి ప్రవేశించాడు. రోజీ, ప్రదీప్ ఇద్దరూ నగ్నంగా ఉండటం చూసి కోపంతో ఊగిపోయాడు. అయితే రోజీ వెంటనే ఓ గాజు బాటిల్ తోప్రదీప్ తలపై బాదింది.

ప్రదీప్ రక్తపు మడుగులో పడిపోయి...స్పృహ కోల్పోయాడు. దీంతో ప్రదీప్, రోజీ ఇద్దరూ కలిసి గెస్ట్ హౌస్ బాల్కనీ నుంచి పీటర్ శవాన్ని విసిరేశారు. ఆత్మహత్యగా చిత్రించే యత్నం చేశారు. అయితే పీటర్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ప్రచారం చేశారు. అయితే ఊరికి దూరంగా ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్ లో పీటర్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముందంటూ, అతడి సోదరుడు అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, రోజీ, ప్రదీప్ లను అనుమానితులుగా అదుపులోకి తీసుకొని విచారించారు. ఇద్దరి కాల్ డేటాలు, ఫోన్ నెంబర్లు, సీసీ ఫుటేజీల ఆధారంగా హత్య చేసారనే అనుమానం బలపడింది. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని, పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
Published by: Krishna Adithya
First published: August 9, 2020, 6:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading