ప్రియుడితో శృంగార కోరికలు తీర్చుకునేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని...దారుణం...

మూడు నెలల క్రితం సోనం తన చిన్ననాటి స్నేహితుడు పప్పును కలిసింది. ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. ఆ పరిచయం కాస్తా వివాహేతర బంధంగా మారింది. దీంతో భర్తను అడ్డు తొలగించుకొని ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

news18-telugu
Updated: July 13, 2020, 10:54 PM IST
ప్రియుడితో శృంగార కోరికలు తీర్చుకునేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని...దారుణం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పశ్చిమ బెంగాల్ లోని పురూలియాలో ఘోరం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడు సహకారంతో భర్తను దారుణంగా చంపేసిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే నిందితురాలు సోనం ( పేరు మార్పు) తన భర్త రాకేష్ ( పేరు మార్పు) తో కలిసి స్థానిక ప్రశాంత్ నగర్ లో నివాసం ఉంటోంది. వీరిద్దరికీ 4 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. ఈ క్రమంలోనే వీరికి ఇంకా పిల్లలు కలగలేదు. భర్త రాకేష్ కు సంతాన సామర్థ్యం లేదని పలుమార్లు సోనం అతడిపై ఆరోపణలు చేసి, గొడవ పడింది. అయితే మూడు నెలల క్రితం సోనం తన చిన్ననాటి స్నేహితుడు పప్పును కలిసింది. ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. ఆ పరిచయం కాస్తా వివాహేతర బంధంగా మారింది. దీంతో భర్తను అడ్డు తొలగించుకొని ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కాగా రెండు వారాల క్రితం...సోనం తన భర్త రాకేష్‌కు యాక్సిడెంట్లో చనిపోయాడని అందరినీ నమ్మించింది.

కాగా మృతుడి కుటుంబ సభ్యులు సోనంపై పోలీసులుకు ఫిర్యాదు చేయగా అసలు సంగతి బయట పడింది. పదిహేను రోజుల తర్వాత ఫోన్ సంభాషణల ఆధారంగా హత్యోదంతం బయటపడింది. హత్య చేసిన విధానం బయట పడటంతో..సోనం, పప్పు ఇద్దరూ కుట్ర పన్ని రాకేష్ హత్య చేసి రోడ్డు మీద పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు ఆడియో రికార్డింగ్‌ల ఆధారంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. నిందితులను అదుపులోనికి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మృతుడు శవాన్ని సమాధి నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Published by: Krishna Adithya
First published: July 13, 2020, 10:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading