WOMAN KILLED HER HUSBAND WITH HER BOYFRIEND IN WEST BENGAL NS
భర్తను చంపి.. బాయ్ ఫ్రెండ్ బెడ్రూంలో పాతిపెట్టిన మహిళ
ప్రతీకాత్మక చిత్రం
ప్రియుడితో సుఖం కోసం ఓ మహిళ ఏకంగా కట్టుకున్న భర్తనే కడతేర్చింది. కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. అనంతరం ఆ బాయ్ ఫ్రెండ్ బెడ్రూంలోనే భర్త శవాన్ని పూడ్చిపెట్టింది.
ప్రియుడితో సుఖం కోసం ఓ మహిళ ఏకంగా కట్టుకున్న భర్తనే కడతేర్చింది. కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. అనంతరం ఆ బాయ్ ఫ్రెండ్ బెడ్రూంలోనే భర్త శవాన్ని పూడ్చిపెట్టింది. పశ్చిమబెంగాల్ లో జరిగిన ఈ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నార్త్ 24పరగణాస్ జిల్లా బొంగావ్ గ్రామానికి చెందిన రామకృష్ణ సర్కారు(42), స్వప్న(38)కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో స్వప్న స్థానికంగా ఉండే సుజిత్ దాస్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే తమ అక్రమ సంబంధానికి భర్త రామకృష్ణ అడ్డు వస్తున్నాడని భావించింది. దీంతో అతడిని హతమార్చాలని ప్రియుడు సుజిత్ దాస్ తో కలిసి స్కెచ్ వేసింది. పక్కా ప్లాన్ ప్రకారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రామకృష్ణను కత్తితో పొడిచింది.
అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని ప్రియుడు సుజిత్ దాస్ బెడ్రూంకు తరలించింది. అక్కడ గుంత తీసి భర్త శవాన్ని పూడ్చి పెట్టింది. తన ఇంట్లో పూడ్చి పెడితే ఎవరైనా గుర్తు పెట్టే అవకాశం ఉందని.. అదే ప్రియుడి బెడ్రూంలో పూడ్చి పెడితే ఎవరికీ ఈ విషయం తెలియదని భావించింది. నిందితుడి ఇంటి ముందు రక్తపు మరకలు ఉన్న విషయం తెలియడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో అతని బెడ్రూంలో శవం పూడ్చి పెట్టిన విషయం బయటపడింది.
తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే స్వప్న ప్రియుడు సుజిత్ దాస్ తో కలిసి చంపేసిందని విచారణలో తేలింది. విచారణలో భాగంగా మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో శవంపై కత్తి గాయాలున్నట్లు తేలింది. నేరాన్ని పోలీసుల ఎదుట స్వప్న అంగీకరించింది. దీంతో ఆమెతో పాటు ఆమకు సహకరించిన సుజిత్ దాస్ ను పోలీసులు అరెస్టు చేశారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.