• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • WOMAN KILLED HER AUNTY BY GIVING POISONED FOOD IN VIJAYAWADA OF ANDHRA PRADESH NK PRN

Vijayawada Murder: అత్తా కోడళ్ల మధ్య గొడవ... ఒకరు బలి

Vijayawada Murder: అత్తా కోడళ్ల మధ్య గొడవ... ఒకరు బలి

ప్రతీకాత్మక చిత్రం (image credit - from youtube)

Vijayawada Murder: అత్తాకోడళ్ల మధ్య ఏం గొడవ జరిగింది? ప్రాణాలు గాల్లో కలిసిపోయేంత దాకా పరిస్థితి ఎందుకు వెళ్లింది? ఎవరి వల్ల ఎవరు చనిపోయారు?

  • Share this:
    Vijayawada Murder: అత్తాకోడళ్ల మధ్య తగాదాలు ప్రతి ఇంట్లో చాలా కామన్. అత్త చేసిన పని కోడలికి నచ్చకపోవడం, కోడలు ప్రవర్తనతో అత్తలు కోపం తెచ్చుకోవడం మనం చూస్తుంటాం. కానీ చిన్నచిన్న గొడవలు పెద్ద పెద్ద నష్టాలకు దారి తీస్తుంటాయి. అలాంటి ఘటనే కృష్ణాజిల్లాలో జరిగింది. విజయవాడ సమీపంలోని పునాదిపాడులో అత్తాకోడళ్ల మధ్య గొడవ ఒకరి ప్రాణాల్ని బలిగొంది. కంకిపాడు మండలం, పునాదిపాడు బీసీ కాలనీకి చెందిన తిరుపతమ్మ, పద్మావతి అత్తాకోడళ్లు. ఎనిమిదేళ్ల కిందట భర్త చనిపోవడంతో పద్మావతి అత్త తిరుపతమ్మతో కలిసి జీవిస్తోంది. పద్మావతి పిల్లలకు కూడా పెళ్లిళ్లు కావడంతో వారు వేరేచోటికి వెళ్లిపోయారు. కొంతకాలంగా పద్మావతి-తిరుపతమ్మ మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పద్మావతిని ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సిందిగా అత్త తరచూ అనేది.

    ఇదే క్రమంలో మరోసారి వీళ్లిద్దరి మధ్య వివాదం తలెత్తింది. మాటమాట పెరగడంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న కోడలు పద్మావతి... రోకలి బండతో అత్త తలపై కొట్టింది. తీవ్రంగా గాయపడిన తిరుపతమ్మను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఐతే అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తేల్చారు. తిరుపతమ్మ కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు పద్మావతిపై కేసు రాశారు.

    ఇది కూడా చదవండి:Haircut Video: ఈ 3 వీడియోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు... వీకెండ్ ఫుల్ ఎనర్జీ

    ఓ వైపు భర్త చనిపోవడం, పిల్లలు దూరంగా ఉండటమే కాకుండా.. రోజు అత్తపెడుతున్న పోరుతో విసిగిపోయిన పద్మావతి... చివరకు ఆమెను అంతమొందించింది. క్షణికావేశంలో నిండుప్రాణాన్ని బలితీసుకుంది. భర్త పోయిన కోడల్ని కూతురిలాగా భావించినా.. అత్తను తల్లిలాగా భావించినా ప్రాణనష్టం జరిగేది కాదని స్థానికులంటున్నారు. ఇప్పుడు అత్త ప్రాణాలు పోగా... పద్మావతికి జైలు జీవితం తప్పదు. అంతా విషాదమే.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు