రూ.3వేల కోసం మహిళ దారుణ హత్య.. పశ్చిమ గోదావరిలో ఘోరం

జూలై 1న డబ్బులు ఇస్తానని చెప్పిన అనూష.. పెదవేగి మండలం 7వ మైలురాయి వద్దకు రావాలని సందీప్‌కు చెప్పింది. అక్కడ వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే డబ్బులు ఇవ్వలేదనే కోపంతో అనూషపై సందీప్ దాడి చేశాడు. మెడకు చున్నీ బిగించి.. ఊపిరాడకుండా చేసి చంపేశాడు.

news18-telugu
Updated: July 13, 2020, 4:18 PM IST
రూ.3వేల కోసం మహిళ దారుణ హత్య.. పశ్చిమ గోదావరిలో ఘోరం
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రూ.3 వేల కోసం మహిళను దారుణంగా హత్యచేశాడో దుండగుడు. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదన్న కోపంతో ఆమెను చంపేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం మొండూరులో ఈ ఘోరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 7న పోలవరం కుడి కాల్వ గట్టు కింద ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. హత్య జరిగిన 10 రోజుల తర్వాత కుళ్లి పోయిన స్థితిలో మృతదేహం కనిపిచింది. ఆమెను దెందులూరు మండలం అక్కిరెడ్డిగూడేనికి చెందిన అనూష (30)గా గుర్తించారు. అనూషకు ముగ్గురు పిల్లలున్నారు. భర్త గతంలోనే చనిపోవడంతో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

ఈ క్రమంలో అనూషకు దెందులూరు మండలం నాగులదేవిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ గుజ్జుల సందీప్‌ పరిచయమయ్యాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఐతే కొన్ని రోజులు క్రితం సందీప్ నుంచి అనూష రూ.3వేలు అప్పుగా తీసుకుంది. వారం రోజుల్లో బాకీ చెల్లిస్తానని చెప్పి ఇంకా ఇవ్వలేదు. జూలై 1న డబ్బులు ఇస్తానని చెప్పిన అనూష.. పెదవేగి మండలం 7వ మైలురాయి వద్దకు రావాలని సందీప్‌కు చెప్పింది. అక్కడ వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే డబ్బులు ఇవ్వలేదనే కోపంతో అనూషపై సందీప్ దాడి చేశాడు. మెడకు చున్నీ బిగించి.. ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని పొదల్లో విసిరేసి అక్కడి నుంచి పారిపోయాడు.

మొదట మృతురాలిని గుర్తించిన పోలీసులు మొబైల్ ఫోన్ సంభాషణల వివరాల ఆధారంగా నిందితుడిని కనిపెట్టారు. జూలై 10న నిందితుడు సందీప్‌ను అరెస్ట్ చేసినట్లు ఏలూరు పోలీసులు తెలిపారు.నిబంధనల ప్రకారం అతడికి కరోనా పరీక్షలు చేయించారు. నెగిటివ్‌ రిపోర్టులు రావడంతో కోర్టులో హాజరుపరిచారు. మృతదేహం లభ్యమైన రెండు రోజుల్లోనే నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ అభినందించారు.
Published by: Shiva Kumar Addula
First published: July 13, 2020, 4:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading