Home /News /crime /

Sad: అనాథగా ఉన్న ఈమెను చేరదీసింది.. ప్రేమగా పెంచింది.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..

Sad: అనాథగా ఉన్న ఈమెను చేరదీసింది.. ప్రేమగా పెంచింది.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..

రోమా

రోమా

ఓ మహిళ.. ఇద్దరు అనాథలను అక్కున చేర్చుకుని ప్రేమను పంచింది. తన దేశం కాకపోయిన ఇక్కడి యువతులను చేరదీసి అన్ని తానై పెంచింది.

  ఓ మహిళ.. ఇద్దరు అనాథలను అక్కున చేర్చుకుని ప్రేమను పంచింది. తన దేశం కాకపోయిన ఇక్కడి యువతులను చేరదీసి అన్ని తానై పెంచింది. కానీ ఇలా జరుగుతుందని మాత్రం ఊహించలేకపోయింది. తాను పెంచినఓ యువతే తన ప్రాణాలను తీస్తుందని కలలో కూడా అనుకోని ఉండదు. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని హైదరాబాద్‌లో(Hyderabad) చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. వివరాలు.. ఫ్రాన్స్‌కి చెందిన మేరీ క్రిస్టీనా(68).. తన కుమార్తెలు మేరీ సొలాంగ్‌, రెబెకాలను తీసుకొని 30 ఏళ్ల కిందట హైదరాబాద్‌ వచ్చారు. ఇక్కడ గండిపేట మండలం దర్గాఖలీజ్ ఖాన్‌లో స్థిరపడింది. ఆమె ఓ కుమార్తె మేరీ సొలాంగ్.. ప్రశాంత్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మేరీ, ప్రశాంత్‌లు సన్‌సిటీలో నివాసం ఉంటున్నారు. క్రిస్టీనా మరో కూతురు పుదుచ్చేరిలో ఉంటుంది.

  ఈ క్రమంలోనే క్రిస్టీనా అనాథలైన రోమా(24), ప్రియాంకలను ఇంట్లో ఉంచుకుని పోషిస్తోంది. రోమాకు పెళ్లి చేయాలనుకుంది. దీంతో ఆమెకు సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. మరోవైపు రోమా మాత్రం మరో వ్యక్తిని ప్రేమించింది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన విక్రమ్‌ శ్రీరాములు(25)తో ప్రేమలో ఉన్న రోమా.. క్రిస్టీనాకు తెలియకుండా అతనితో సహజీవనం(Live-in Relationships) చేస్తోంది. అయితే రోమా ప్రవర్తనలో తేడాను గమనించిన క్రిస్టీనా ఆమెను మందలించింది.

  Mumbai Rape Case: ఆమె మరణించింది.. దేశ ఆర్థిక రాజధానిలో జరిగిన అత్యంత క్రూరమైన లైంగిక దాడి ఇది..

  అయితే రోమా మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లింది. బొటిక్‌ పెట్టుకునేందుకు డబ్బులు ఇవ్వాలని కిస్ట్రీనాను రోమా కోరింది. అయితే అందుకు క్రిస్టీనా ఆమె నిరాకరించింది. దీంతో డబ్బుల కోసం క్రిస్టీనాను హత్య చేయాలని రోమా నిర్ణయించుకుంది. క్రిస్టీనాను చంపి ఆమె ఖాతాలోని డబ్బులను సొంతం చేసుకోవాలని భావించింది.

  క్రిస్టీనాను హత్య చేసేందుకు ప్రియుడు శ్రీరాములుతో కలిసి స్కెచ్ వేసింది. ఇందుకు శ్రీరాములు అతని పాత స్నేహితుడు రాహుల్ గౌతమ్ సాయం కూడా తీసుకన్నాడు. ఈ నెల 8వ తేదీన ఆమె ఇంటి వద్ద కాపు కాసిన శ్రీరాములు, రాహుల్.. బయటి నుంచి ఇంటికి చేరుకున్న క్రిస్టీనాపై దాడి చేశారు. ఆమె మెడకు తాడును బిగించి ప్రాణాలు తీశారు. అనంతరం క్రిస్టీనా కారులోనే మృతదేహాన్ని హిమాయత్ సాగర్ సమీపంలోని పొదల్లో పడేశారు. ఆ తర్వాత తిరిగి క్రిస్టీనా ఇంటికి చేరుకుని ఇంట్లో నుంచి కొన్ని వస్తువులు పారిపోయారు. ఆ తర్వాత రోజు క్రిస్టీనా ఖాతా నుంచి రోమా తన ఖాతాలోకి రూ. 2 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసింది.

  Medicine from Sky: డ్రోన్లతో మెడిసిన్ పంపిణీ.. దేశంలో తొలిసారి.. ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

  క్రిస్టీనా కనిపించకుండా పోవడంతో ఆమె కూతురు మేరీ సొలాంగ్, అల్లుడు ప్రశాంత్‌ రాజేంద్ర నగర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే రోమా ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు నిందితులు రోమా, ఆమె ప్రియుడు శ్రీరాములు, అతని స్నేహితుడు రాహుల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Crime news, Hyderabad, Murder

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు