వివాహేతర సంబంధం.. ఆపై అప్పు.. మహిళ దారుణ హత్య

వివాహేతర సంబంధం, అప్పు వంటి అంశాలు ఓ మహిళ ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి.

news18-telugu
Updated: July 13, 2020, 9:58 AM IST
వివాహేతర సంబంధం.. ఆపై అప్పు.. మహిళ దారుణ హత్య
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ యువకుడు... ఆమెకు రూ. 3 వేలు అప్పుగా ఇచ్చాడు. అయితే ఆ అప్పు తిరిగి చెల్లించేందుకు అంగీకరించని మహిళను అతి దారుణంగా హత్య చేశాడు ఆ యువకుడు. ఈ హత్య కేసును వారం రోజుల్లో చేధించారు పోలీసులు. వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం నాగులదేవుపాడు గ్రామానికి చెందిన గుజ్జుల సందీప్‌ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి దెందులూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన జానపూడి అనూషతో శారీరక సంబంధం ఉంది.

కొద్దిరోజుల క్రితం అనూషకు డబ్బులు అవసరం కావటంతో వారం రోజుల్లో తిరిగి ఇస్తానంటూ రూ.3 వేలు అప్పుగా అడిగింది. తాను ఆటో వాయిదా కట్టేందుకు దాచిన సొమ్ము రూ.3 వేలు అనూషకు ఇచ్చాడు. అనంతరం సందీప్‌ డబ్బులు అడుగుతూ ఉండగా ఆమె ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకుంటోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఆటో కిరాయిలు లేక ఇబ్బందులు పడుతున్న సందీప్‌ కొన్ని రోజుల నుంచి డబ్బులు కావాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో జూలై 1న మధ్యాహ్నం 12 గంటల సమయంలో అనూష ఫోన్‌ చేసి సందీప్‌ను 7వ మైలు దగ్గరకు రమ్మని చెప్పటంతో అతను ఆటో వేసుకుని అక్కడికి వెళ్ళాడు.

ఇద్దరూ కలిసి ఆటోలో మొండూరు వద్ద పోలవరం కుడికాలువ గ్రావెల్‌ రోడ్డులోకి వెళ్ళి ఆటోను పక్కగా పెట్టి మట్టిదిబ్బల వద్దకు వెళ్ళారు. ఇద్దరూ ఇష్టపూర్వకంగానే శారీరకంగా కలిశారు. అనంతరం సందీప్‌ ఆమెను డబ్బులు గురించి అడగటంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో సందీప్‌ కోపంతో అనూషను గట్టిగా కొట్టాడు. అనంతరం ఆమె ముక్కు, నోటిని తన రెండు చేతులతో గట్టిగా అదిమిపట్టాడు. అనూష మెడలోని చున్నీతో బలంగా లాడి ముడివేశాడు. ఆమె చనిపోవటంతో అనూష మొబైల్‌ ఫోను, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఓటర్‌ కార్డు తీసుకుని ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఈ హత్య కేసును కొద్దిరోజుల్లోనే చేధించిన పోలీసులు... నిందితుడు సందీప్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Published by: Kishore Akkaladevi
First published: July 13, 2020, 9:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading