స్కూటీ ముందు భాగంలో గోనెసంచీ మూట.. అర్ధరాత్రి మామిడి తోటకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేశాడు.. ఇంతకీ ఆ మూటలో ఏముందంటే..

నిందితుల అరెస్ట్ ను చూపుతున్న పోలీసులు

ఊరికి దూరంగా మామిడి తోటలోకి వెళ్లాడు. బాగా బరువున్న ఆ గోన సంచీ మూటను మామిడి తోటలో చాలా లోపలికి తీసుకెళ్లాడు. అక్కడే ఆ మూటకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ మూట పూర్తిగా కాలకముందే..

 • Share this:
  రాత్రి పూట ఓ వ్యక్తి తన స్కూటీ ముందటి భాగంలో ఓ గోనె సంచీ మూటను పెట్టుకున్నాడు. ఊరికి దూరంగా మామిడి తోటలోకి వెళ్లాడు. బాగా బరువున్న ఆ గోన సంచీ మూటను మామిడి తోటలో చాలా లోపలికి తీసుకెళ్లాడు. అక్కడే ఆ మూటకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ మూట పూర్తిగా కాలకముందే ఎవరైనా చూస్తారని ఇంటికి తిరిగొచ్చేశాడు. ఆ మూటలో ఉన్నది ఏ చెత్తో, ఇతర వ్యర్థ పదార్థాలో కాదు. ఓ మృతదేహం. అది కూడా అతడి భార్యదే. అవును. భార్యన చంపి ఊరికి దూరంగా మామిడి తోటలోకి తీసుకెళ్లి శవాన్ని కాల్చాడా వ్యక్తి. అందుకు తోడ్పడింది కూడా అతడి అత్తే. మృతిచెందిన మహిళ కన్న తల్లే ఈ హత్యలో పాలుపంచుకుంది. అల్లుడికి సాయం చేసింది. సగం కాలిన శవం గురించి విషయం బయటపడటంతో ఆ అత్త, అల్లుడు పోలీసులకు లొంగిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  తూర్పు గోదావరి జిల్లాలోని తుని మార్కండ్రాజు పేటలో సన్నాయి వాయిద్యకారుడు చింతపల్లి సత్యనారాయణ నివసిస్తున్నాడు. అతడికి 2004వ సంవత్సరంలోనే తన అక్క సత్తెమ్మ కుమార్తె ఆదిలక్ష్మితో పెళ్లయింది. ఈ దంపతులకు పదో తరగతి, నాలుగో తరగతి చదువుతున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే కొంత కాలంగా ఆదిలక్ష్మి కొంత మందితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానం భర్తలో కలిగింది. ఆదిలక్ష్మి తల్లి కూడా ఇదే విషయమై పలుమార్లు ఆమెను హెచ్చరించింది. పద్ధతి మానుకోవాలని తల్లి సత్తెమ్మ, భర్త సత్యనారాయణ చెప్పినప్పటికీ ఆమె ఏమాత్రం లక్ష్యపెట్టలేదు. దీంతో ఫిబ్రవరి 28వ తారీఖున ఇంట్లో ఇదే విషయమై గొడవ జరిగింది. ఈ గొడవలో సుత్తితో ఆదిలక్ష్మిని సత్తెమ్మ, ఆమె అల్లుడు కలిసి హతమార్చారు.
  ఇది కూడా చదవండి: ఒక్క ఘటనతో వరుడికి డబుల్ షాక్స్.. తెల్లవారుజామున వధువును తీసుకెళ్లిన తాత.. చివరకు సీన్ రివర్స్

  అయితే విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడేందుకు బాగా ఆలోచించారు. మొత్తానికి ఆదిలక్ష్మి మృతదేహాన్ని ఓ గోనెసంచీలో కుక్కి, మూటగట్టి, స్కూటీ ముందటి భాగంలో సత్యనారాయణ పెట్టుకున్నాడు. ఆ మూటను కొత్త వెలంపేట శివారులోని ఓ మామిడి తోటకు తరలించాడు. అక్కడ ఆ మూటపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఎవరైనా చూస్తారన్న భయంతో వెంటనే ఇంటికి వచ్చేశాడు. అయితే మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కీలక ఆధారాలను సేకరించారన్న వార్తలు సత్తెమ్మ, సత్యనారాయణకు తెలిశాయి. దీంతో వారిద్దరూ భయపడిపోయి బుధవారం పోలీసులకు లొంగిపోయారు. తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరినీ రిమాండ్ కు తరలించారు. తల్లి మరణం, తండ్రి, అమ్మమ్మ జైలు పాలవడంతో ఆ ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
  ఇది కూడా చదవండి: రోజుల గ్యాప్ లోనే వరుస ఘటనలు.. ప్రపంచం అంతానికి ఇవే చివరి సూచనలు.. 2021లో ఏం జరగబోతోందో ముందే చెప్పిన నోస్ట్రడామస్..!
  Published by:Hasaan Kandula
  First published: