వారం క్రితం మహిళ మిస్సింగ్.. ప్రియుడు దొరకడంతో.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

ప్రతీకాత్మక చిత్రం

చెన్నమ్మ కూతురు వివాహానికి లక్ష రూపాయలు ఇచ్చిన జంగయ్య తిరిగి డబ్బుల కోసం చెన్నమ్మను వేధించడం మొదలుపెట్టాడు.

 • Share this:
  వివాహేతర సంబంధం ఓ మహిళ హత్యకు దారితీసింది. రంగారెడ్డి జిల్లాకేశంపేట మండలంలోని తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన రాములు చెన్నమ్మతో కొంతకాలంగా సహజీవనం కొనసాగిస్తున్నాడు. చెన్నమ్మకు ముగ్గురు పిల్లలు. కేశంపేట మండలంలోని పోమాల్‌పల్లికి చెందిన జంగయ్యతో చెన్నమ్మకి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. షాద్‌నగర్‌లో పండ్ల బండి వ్యాపారం చేస్తున్న చెన్నమ్మ హఠాత్తుగా కనిపించకుండా పోయింది. అనుమానం వచ్చిన ఆమె కుమారుడు ఎరుకలి శివ షాద్‌నగర్ పోలీసులకు రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన షాద్ నగర్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

  కేసులో ప్రధాన అనుమానితుడు జంగయ్య కోసం వెతికారు. నిన్న బస్టాండ్ సమీపంలో జంగయ్యని అదుపులోకి తీసుకుని విచారించడంతో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఈ నెల 22న చెన్నమ్మ,జంగయ్యతో కలసి తలకొండపల్లి మండలంలోని చెన్నారం సమీపంలో ఉన్న మల్లప్పగుట్టపైకి వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు.అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో జంగయ్య ఆగ్రహంతో రగిలిపోయాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న జంగయ్య దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు.

  చెన్నమ్మ కూతురు వివాహానికి లక్ష రూపాయలు ఇచ్చిన జంగయ్య తిరిగి డబ్బుల కోసం చెన్నమ్మను వేధించడం మొదలుపెట్టాడు. చెన్నమ్మకు కళ్యాణ లక్ష్మీ చెక్కు రావడంతో డబ్బుల కోసం వత్తిడి చేశాడు. ఈ నేపధ్యంలో ఇద్దరి మధ్య వివాదం పెరిగి బండరాయి తీసుకుని ప్రియురాలు చెన్నమ్మ తలపై కొట్టాడు. దెబ్బ బలంగా తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులకు జంగయ్య చెప్పిన వివరాల మేరకు మల్లప్పగుట్ట సమీపంలో చెన్నమ్మ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి చివరకు జంగయ్యను అరెస్ట్ చేశారు. నేడు అతడిని రిమాండ్‌కు తరలించారు. అతనిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్టు పోలీసులు తెలిపారు. గతంలో జంగయ్య జైలుకు వెళ్లి వచ్చిన నేపథ్యం ఉందని వెల్లడించారు.
  Published by:Kishore Akkaladevi
  First published: