Home /News /crime /

WOMAN KILLED BY HER HUSBAND AFTER CALLING HER TO HOTEL ROOM IN NEW DELHI AK

పాపం.. ఆ రోజు హోటల్ గదికి వెళ్లకుంటే.. ఈ రోజు ఈ మహిళ పరిస్థితి వేరుగా ఉండేది..

మృతురాలు (పైల్ ఫోటో)

మృతురాలు (పైల్ ఫోటో)

సోమవారం మరోసారి భార్యకు ఫోన్ చేసి హోటల్ గదికి రమ్మన్నాడు అర్జున్. కచ్చితంగా రావాలని పదే పదే ఆమెను కోరాడు. అయితే భర్త మారిపోయాడని ప్రియాంక నమ్మింది.

    కట్టుకున్న వాడు కొన్నిరోజులుగా భార్యను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో అతడి వేధింపులు భరించలేక ఆ మహిళ అతడి నుంచి దూరమైంది. తన ఏడాదిన్నర కూతురితో కలిసి వేరే ప్రాంతంలో నివాసం ఉంటోంది. కూతురిని పెంచేందుకు ఉద్యోగం కూడా చేసుకుంటోంది. కానీ తన భార్య ఈ రకంగా తనకు దూరంగా ఉండటాన్ని ఆమె భర్తకు నచ్చలేదు. దీంతో అతడితోని రాక్షసుడు నిద్రలేచాడు. చివరకు ఆమెను కుట్ర చేసి చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. ప్రియాంక అనే మహిళకు అర్జున్ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. వీరికి ఏడాదిన్నర పాప కూడా ఉంది. అయితే పెళ్లయిన ఏడాదిన్నర తరువాత వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి రోజురోజుకు పెరిగిపోయాయి. దీంతో భర్త నుంచి వేరుగా ఉండాలని నిర్ణయించుకుంది ప్రియాంక. ఢిల్లీలోని తన సమీప బంధువులు దగ్గర నివాసం ఉంటోంది.

    అక్కడే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని.. కూతురితో కాలం గడుపుతోంది. అయితే తన భార్య తనతో ఉండపోవడంతో ఆమె భర్తకు కోపం పెరిగింది. దీంతో ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు అర్జున్. ఇందుకోసం ఆమెను ప్రేమగా మాట్లాడి బుట్టలో పడేశాడు. ఆదివారం ప్రియాంక పుట్టినరోజు కావడంతో.. హోటల్ గదికి రావాలని పిలిచాడు. భార్య కోసం కొన్ని బహుమతులు కూడా తెచ్చానని నమ్మించాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా ప్రియాంక తన భర్త ఉంటున్న హోటల్ గదికి వెళ్లలేకపోయింది.

    సోమవారం మరోసారి భార్యకు ఫోన్ చేసి హోటల్ గదికి రమ్మన్నాడు అర్జున్. కచ్చితంగా రావాలని పదే పదే ఆమెను కోరాడు. అయితే భర్త మారిపోయాడని ప్రియాంక నమ్మింది. అతడు ఉంటున్న హోటల్ గదికి వెళ్లింది. తాను ఉంటున్న గదికి వచ్చిన భార్యను వెంటనే బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లాడు అర్జున్. వెంటనే తన దగ్గర ఉన్న కత్తితో ఆమె మెడను కోసేశాడు. దీంతో ప్రియాంక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆమె కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. అయితే వెంటనే అక్కడి పారిపోయాడు అర్జున్.

    తెలియని వ్యక్తితో డేటింగ్‌కు రెడీ.. ఓసారి వాడెవడో చూద్దామని గూగుల్లో సెర్చ్.. అంతే కాళ్ల కింద భూమి కంపించింది...

    Affair: భర్తను వదిలేసి మరొకరితో ప్రేమ.. కానీ అక్కడ కూడా తేడా కొట్టింది.. చివరికి

    ఈ క్రమంలో హోటల్ సిబ్బందికి తోసేశాడు. ప్రియాంక హత్య గురించి హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రియాంకను వరకట్నం డిమాండ్ చేయడంతో అత్తమామలు కొట్టేవారని బంధువులు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితుడైన భర్త అర్జున్‌పై బంధువులు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే భర్త తనను హత్య చేస్తాడని ఊహించలేకపోయిన ప్రియాంకకు ఈరకంగా జరగడంతో.. ఆమె ఏడాదిన్నర కూతురు అనాథగా మారిపోయింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Crime news, Husband kill wife

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు