Home /News /crime /

WOMAN KIDNAPS HER HUSBAND WITH HER BROTHERS HELP IN RANGAREDDY DISTRICT SU

Telangana: భర్తకు బుద్ది చెప్పాలని చూసిన భార్య.. కానీ చివరకు జరిగింది ఏమిటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ మహిళ తనను అనుమానిస్తూ వేధింపులకు పాల్పడుతున్న భర్తకు బుద్ది చెప్పాలని చూసింది. ఇందుకోసం ఓ ప్లాన్‌ను అమలు చేసింది. అయితే చివరకు ఏం జరిగిందంటే..

    ఓ మహిళ తనను అనుమానిస్తూ వేధింపులకు పాల్పడుతున్న భర్తకు బుద్ది చెప్పాలని చూసింది. ఈ క్రమంలోనే అతడిని సోదరుల సాయంతో కిడ్నాప్ చేసింది. అయితే చివరకు ఇది ఆమెను ఇబ్బందుల పాలు చేసింది. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. ఏపీలోని ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన తమ్మిశెట్టి ఆంజనేయులు, శాంత దంపతులు ఉపాధికోసం రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం కొర్రోనితండాలో నివాసం ఉంటున్నారు. వీరికి కొడుకు శివ(16) ఉన్నాడు. అయితే కొంతకాలంగా ఆంజనేయులు, శాంత మధ్య గొడవలు జరగడం కామన్ అయిపోయింది.

    ఇటీవలి కాలంలో గొడవలు భారీగా పెరగడంతో.. శాంత ఏల్చూరుకు వెళ్లిపోయింది. అయితే తనను వేధిస్తున్న భర్తకు ఎలాగైనా బుద్ది చెప్పాలని శాంత భావించింది. ఇందుకు తన సోదరులు చిన్నబాబు, వెంకట సుబ్బారావు, అక్క కొడుకు అనిల్‌కుమార్‌ల సాయం కోరింది. ఆ తర్వాత ఆంజనేయులను కిడ్నాప్ చేయాలని వారు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే శాంత, చిన్నబాబు, వెంకట సుబ్బారావు, అనిల్‌కుమార్..ఆటోలో జూన్ 22న యాచారం మండలం మాల్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత ఆంజనేయులు, శివ ఇద్దరు అక్కడికి వచ్చేలా చేశారు.

    వారిద్దరు అక్కడికి చేరుకున్నాక.. ఆంజనేయులును ఆటోలో బంధించి తీసుకెళ్లిపోయారు. దీంతో కంగారు పడిపోయిన ఆంజనేయులు కుమారుడు శివ.. 100కు ఫోన్ చేసిన పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన యాచారం పోలీసులు.. ఆంజనేయులు జాడ కోసం గాలింపు చేపట్టారు. అయితే ఎంత వెతికినా లాభం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే.. ఆంజనేయులును తీసుకెళ్లిన ఆటో చివరకు నరసరావుపేటకు చేరింది. దీంతో అక్కడి పోలీసులకు ఫోన్ చేసిన యాచారం పోలీసులు వారి సాయం కోరారు. తర్వాత అక్కడికి వెళ్లిన యాచారం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆంజనేయులు, శాంతల మధ్య గొడవలకు సంబంధించి అక్కడి పోలీసు స్టేషన్‌లో గతంలోనే రెండు కేసులు నమోదైనట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక, నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టి.. రిమాండ్‌కు తరలించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Kidnap, Ranga reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు