Woman forcibly eat human meat : డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో(Congo) షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులు ఓ మహిళను కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె చేత మానవ మాంసాన్ని(Human Meat) బలవంతంగా వండించి ఆమెతో తినిపించారు. ఈ విషయాన్ని కాంగో హక్కుల సంఘం బుధవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి(UNSC) తెలిపింది. మహిళా హక్కుల సంఘం మహిళా సాలిడారిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ పీస్ అండ్ డెవలప్‌మెంట్ (SOFEPADI) అధ్యక్షురాలు జూలియన్ లుసెంగ్, తూర్పు కాంగోలో జరిగిన సంఘర్షణపై 15 మంది సభ్యుల కౌన్సిల్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ మహిళ విషయాన్ని ప్రస్తావించారు.
కాంగోలో మే చివరి నుండి ప్రభుత్వం- తిరుగుబాటు సమూహాల మధ్య భారీ పోరాటం తీవ్రమైన హింసకు దారితీస్తోంది. ఈ క్రమంలోనే అప్పు చెల్లించేందుకు బంధువుల ఇంటికి బయల్దేరిన ఓ మహిళను కోడెకో తీవ్రవాదులు అపహరించినట్లు జూలియన్ లుసెంగ్ తెలిపారు. కిడ్నాప్ చేసి తనపై పదేపదే అత్యాచారం, శారీరకంగా వేధింపులకు గురిచేశారని బాధిత మహిళ హక్కుల సంఘానికి తెలిపిందని..బంధీగా ఉన్న సమయంలో ఉగ్రవాదులు ఓ వ్యక్తి గొంతు కోసి చంపి అతడి మాంసాన్ని తనతో వండించినట్లు మహిళ చెప్పినట్లు లుసెంగ్ తెలిపారు. మనిషి మాంసాన్ని ఉడికించి తనతో పాటు బంధీగా ఉన్న మరికొందరికి ఆ మాంసాన్నే ఆహారంగా ఇచ్చారని ఆ మహిళ చెప్పినట్లు లుసెంగ్ తెలిపింది.
Dutch MP Geert Wilder : ఇస్లాం పట్ల మెతక వైఖరి వద్దు..ఉదయ్ పూర్ హత్య ఘటనపై డచ్ ఎంపీ
కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ విడుదలయ్యిందని, అయితే ఆమె ఇంటికి తిరిగి రాగానే ఆమెను మరో ఉగ్రవాద బృందం అపహరించుకుపోయిందని, వారి సభ్యులు కూడా ఆమెపై పదేపదే అత్యాచారం చేశారని లూసెంజ్ చెప్పారు. అదే సమయంలో మళ్లీ మానవ మాంసాన్ని ఉడికించి తినమని అడిగారని... అయితే చివరకు ఆ మహిళ ప్రాణాలతో బయటపడిందని తెలిపింది. లూసెంజ్ తన కౌన్సిల్ ప్రసంగ సమయంలో మహిళను కిడ్నాప్ చేసి మిలిటెంట్ గ్రూప్ పేరు చెప్పలేదు. కాగా,కాంగాలో CODECO గ్రూప్ అనేక మంది సాయుధ ఉగ్రవాదులలో ఒకరు, వీరు కాంగోకు తూర్పున ఖనిజాలు అధికంగా ఉండే భూమి, వనరుల కోసం చాలా కాలంగా పోరాడుతున్నారు. గత దశాబ్దంలో వీరు జరిపిన దాడుల్లో వేలాది మంది చనిపోయారు. అదే సమయంలో లక్షల మంది నిర్వాసితులయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rape on women