భార్యను కిడ్నాప్ చేసిన భర్త... ఫ్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్ రేప్...

కంచే చేనును మేస్తే... కాపాడేదెవరన్నట్లు ఉంది ఈ కేసు. భార్యకు అండగా ఉండాల్సిన భర్తే ఎందుకు ఈ కిరాతకానికి పాల్పడ్డాడు?

news18-telugu
Updated: August 2, 2020, 2:22 PM IST
భార్యను కిడ్నాప్ చేసిన భర్త... ఫ్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్ రేప్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రకరకాల నేరాలకు ఉత్తరప్రదేశ్ అడ్డా అవుతోంది. అక్కడే జరిగింది ఈ దారుణం. 28 ఏళ్ల బాధితురాలు... యూపీలోని ఫిలిబిత్‌కి చెందినది. తన భర్త, మరో ముగ్గురిపై ఆమె కిడ్నాప్, గ్యాంగ్ రేప్ కేసు పెట్టింది. జులై 24న ఓ కౌన్సెలింగ్ కేంద్రం దగ్గర భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత... "ఇంటికెళ్లి తేల్చుకుందాం ఇక్కడొద్దు" అన్నాడు. ఇద్దరూ కారు ఎక్కారు. ఆమెను ఇంటికి తీసుకెళ్లకుండా... నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న తన ఫ్రెండ్స్ దగ్గరకు తీసుకెళ్లాడు. భర్తతో పాటూ అతని ముగ్గురు ఫ్రెండ్స్ ఆమెను ఓ ఇంట్లో బంధించారు. రెండ్రోజులపాటూ... గ్యాంగ్ రేప్ చేశారు. ఆ తర్వాత ఓ రైల్వే ట్రాక్‌పై ఆమెను వదిలేసి పారిపోయారు.

ప్రభుత్వ అంబులెన్స్ సర్వీసులో పనిచేస్తున్న అతన్ని 2016లో పెళ్లి చేసుకుంది ఆమె. పెళ్లి తర్వాత ఏదో ఒక కారణంతో ఆమెను తిడుతూనే ఉండేవాడు. 2018లో ఆమె గర్భిణీ అవ్వగా... బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఆమె భర్తపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి... విడాకుల కోసం అప్లై చేసుకుంది. అందులో భాగంగా జులై 24న ఆమెను కౌన్సెలింగ్‌కి రమ్మని పిలిచారు. అక్కడకు వెళ్లి... ఆమెను ఇంటికి తీసుకెళ్తున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. ఆమె కారు ఎక్కాక... ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత దారుణం జరిగింది. జులై 26న షాహీ రైల్వే స్టేషన్ పట్టాలపై ఆమె ఒంటరైంది.

పట్టాలపై ఉన్నందుకు పోలీసులు ఆమెపై కేసు రాశారు. తన భర్త, అతని ముగ్గురు ఫ్రెండ్స్‌పై మాత్రం గ్యాంగ్ రేప్ కంప్లైంట్ నమోదు చేయలేదని బాధితురాలు ఆవేదన చెందుతోంది. దీనిపై తాను జిల్లా సూపరింటెండెన్స్ ఆఫ్ పోలీస్‌కి పూర్తి వివరాలతో కంప్లైంట్ ఇస్తానని అంటోంది. ఇలాంటి రకరకాల దారుణాలు ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్నాయి.
Published by: Krishna Kumar N
First published: August 2, 2020, 2:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading