భర్తతో చిన్న తగాదా.. క్షణికావేశంతో భార్య ఆత్మహత్య..

ఎటువంటి సమస్యలు లేని వీరి జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో అనుకోని ఘటన జరిగింది. ఆదివారం బంధువుల ఇంట్లో ఫంక్షన్ కావడంతో..వెళ్దామని భర్తను అడిగింది. అందుకు అతను తిరస్కరించడంతో తీవ్ర మనస్తాపం చెందింది.

news18-telugu
Updated: July 15, 2019, 12:28 PM IST
భర్తతో చిన్న తగాదా.. క్షణికావేశంతో భార్య ఆత్మహత్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చిన్న చిన్న కారణాలకే.. క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తనను ఫంక్షన్‌కు తీసుకెళ్లలేదన్న ఓ కారణంతో ఓ ఇల్లాలు తన రెండేళ్ల బిడ్డతో కలిసి బిల్డింగ్‌ పైనుంచి దూకి చనిపోయిన ఘటన తాజాగా హైదరాబాద్ బాలాజీనగర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కూకట్‌పల్లిలోని బాలాజీ నగర్‌లో పద్మజ అనే మహిళ తన భర్తతో కలిసి నివాసముంటోంది.వీరికి రెండేళ్ల పాప ఉంది. ఇటీవలే వీరు శ్రీలంక హాలీడే టూర్ వెళ్లొచ్చారు. ఎటువంటి సమస్యలు లేని వీరి జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో అనుకోని ఘటన జరిగింది. ఆదివారం బంధువుల ఇంట్లో ఫంక్షన్ కావడంతో..వెళ్దామని భర్తను అడిగింది. అందుకు అతను తిరస్కరించడంతో తీవ్ర మనస్తాపం చెందింది.
తన రెండేళ్ల బిడ్డతో కలిసి బిల్డింగ్ పైనుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో పద్మజ అక్కడికక్కడే మృతి చెందగా.. చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

First published: July 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>