Home /News /crime /

WOMAN JUMPS OFF 40 FOOT HIGH METRO STATION TERRACE IN DELHI SAVED PAH

Shocking: మెట్రోస్టేషన్ లో కలకలం.. 40 అడుగుల ఎత్తైన టెర్రస్ నుంచి దూకిన యువతి.. ట్విస్ట్ ఏంటంటే..

బాధితురాలిని ఆస్పత్రికి తరలిస్తున్నపోలీసులు

బాధితురాలిని ఆస్పత్రికి తరలిస్తున్నపోలీసులు

Delhi: ఒక యువతి మెట్రోస్టేషన్ కు చేరుకుంది. ఆ తర్వాత.. అక్కడే ఉన్న ఎత్తైన టెర్రస్ పైకి ఎక్కింది. ఈ క్రమంలో అందరు చూస్తుండగానే అక్కడి నుంచి కిందకు దూకింది.

Woman Jumps Off 40 Foot High Metro Station in delhi: ఢిల్లీలోని అక్షరధామ్ మెట్రో స్టేషన్‌లో ఒక యువతి పోలీసులకు చుక్కలు చూపించింది. పంజాబ్ కు చెందిన ఇరవై ఏడేళ్ల యువతి గురువారం మెట్రోస్టేషన్ లో హల్ చల్ చేసింది. ఆమె.. గురువారం ఉదయం 2 వ నంబర్ ప్లాట్ ఫామ్ చేరుకుంది. ఆ తర్వాత.. అక్కడ టెర్రస్ పైకి ఎక్కింది. ఆమెను అక్కడే ఉన్న కొంత మంది ప్రయాణికులు గమనించారు. వెంటనే కిందకు దిగి రావాలని అభ్యర్థించారు.

ఈ క్రమంలో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటన స్థలానికి సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యురీటి సిబ్బంది చేరుకున్నారు. వెంటనే యువతిని కాపాడటానికి అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. ప్లాట్ ఫామ్ కింద భాగంలో.. దుప్పటి మాదిరిగా ఏర్పాటు చేశారు. కొందరు పోలీసులు ఆమెను దిగి కిందకు వచ్చేయాలని కోరారు. మరికొందరు ఆమెను మాటల్లో పెట్టి కొందరు పోలీసులు ఆమెను చేరుకొవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె ఒక్కసారిగి 40 అడుగులు ఎత్తైన మెట్రో టెర్రస్ నుంచి కిందకు దూకేసింది. దీంతో..  ఆమె పోలీసులు ఏర్పాటు చేసిన దుప్పటిలో పడింది.

కానీ ఆమె దూకగానే.. కిందకు పడే క్రమంలో.. ఇతర బిల్డింగ్ కిటికీలు, గోడలు ఆమెకు తగిలాయి. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. యువతికి ప్రాణాపాయం తప్పపడంతో అధికారులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన యువతి పంజాబ్ కు చెందినదని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రాజస్థాన్ లో గతంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది.

Road accident at Alwar: రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన బస్సు, ట్రాక్టర్ వాహానాలు ఢీకొన్నాయి.ఈ ఘటన వలన ఒక్కసారిగా రోడ్డంతా భీతావహాకంగా మారిపోయింది. దీనిలో ముగ్గురు మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కుషల్ గఢ్ సమీపంలో... రాజస్థాన్ రోడ్ వేస్ బస్సు, ఇటుకలతో నిండిన ట్రాక్టర్ మధ్య ప్రమాదం జరిగింది. వీరిలో ముగ్గురు ఘటన స్థలంలోనే వాహానాల కింద విగత జీవిగా మారిపోయాడు.

మృతుల్లో బస్సు డ్రైవర్ ఉన్నారు. మిగతా వారిని సమీపలోని ఆస్పత్రికి తరలించారు. వారందరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. బ్రేకులు ఫెయిల్ అవ్వడం వలన ప్రమాదం జరిగిందా లేదా అదుపు తప్పి ఢీకొన్నాయా, నిద్రమత్తులో ఏదైన ప్రమాదం జరిగిందా అన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన కలకలంగా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Suicide attempt, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు