అబ్బాయి శవానికి బదులు అమ్మాయి... అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు...

ఫిబ్రవరి 28న సౌదీలో గుండెపోటుతో చనిపోయిన కేరళవాసి... దాదాపు 20 రోజుల తర్వాత రఫీక్ మృతదేహం బదులు మహిళ శవాన్ని పంపించిన అధికారులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 22, 2019, 7:12 PM IST
అబ్బాయి శవానికి బదులు అమ్మాయి... అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు...
మారిన మృతదేహాలు... అబ్బాయికి బదులు అమ్మాయి (నమూనా చిత్రం)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 22, 2019, 7:12 PM IST
వారి కొడుకు చనిపోయాడనే బాధతో కృంగిపోయారా తల్లిదండ్రులు. కొడుకును కడసారి చూసుకునేందుకు కన్నీళ్లతో ఎదురుచూస్తున్నారు. బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లిన కొడుకు మృతదేహం కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు ఊహించని షాక్‌ను తగిలింది. కొడుకు శవపేటిక తెరిచిచూడగా అందులో ఓ యువతి శవం కనిపించింది. సౌదీ అరేబియా అధికారుల నిర్వాకానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ సంఘటన. కేరళ రాష్ట్రానికి చెందిన మహ్మద్ రఫీక్ అనే యువకుడు... బతుకు తెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. ప్రమాదవశాత్తు ఫిబ్రవరి 28న అతను గుండెపోటుతో చనిపోయాడు. కేరళలో ఉన్న రఫీక్ కుటుంబసభ్యుల కోరిక మేరకు... అతని మృతదేహాన్ని స్వదేశం పంపడానికి అంగీకరించింది సౌదీ ప్రభుత్వం. లాంఛనాలన్నీ పూర్తిచేసి... ఎట్టకేలకు దాదాపు 20 రోజుల తర్వాత రఫీక్ మృతదేహం స్వదేశానికి చేరుకుంది. కొడుకును చివరిసారిగా చూద్దామని శవపేటికను తెరిచి చూసిన రఫీక్ కుటుంబసభ్యులు...షాక్‌కు గురయ్యారు. శవపేటికలో రఫీక్ మృతదేహానికి బదులుగా ఓ అమ్మాయి శవం కనిపించింది.

స్థానిక పోలీసులు కూడా మృతదేహం మారిన విషయాన్ని ధృవీకరించి, సౌదీ రాయభార కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. వాళ్లు ఇదేంటని సౌదీ అధికారులను నిలదీయగా... వాళ్లు తాపీగా జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పారు. శ్రీలంకకు వెళ్లాల్సిన మృతదేహం... పొరపాటున కేరళకు వచ్చిందని జరిగిన తప్పిదాన్ని అంగీకరించారు. అమ్మాయి మృతదేహాన్ని కొట్టాయం మెడికల్ కాలేజీకి పంపిన అధికారులు... అక్కడి నుంచి వీలైనంత త్వరగా తిరిగి సౌదీకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. మరి రఫీక్ మృతదేహం ఏమైనట్టు? పొరపాటున బాక్సులు మారి, శ్రీలంక వెళ్లిందా? లేక సౌదీలోనే ఉండిపోయిందా? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.


First published: March 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...