నెల్లూరు జిల్లాలో మహిళ ఆత్మహత్యాయత్నం... ఇంటి స్థలం కోసం...

ఇంటి స్థలం విషయంలో చేజర్ల ఎమ్మార్వో వేధిస్తున్నారంటూ పురుగులు మంది సేవించేందుకు ఓ మహిళ ప్రయత్నించింది.

news18-telugu
Updated: November 18, 2019, 11:11 PM IST
నెల్లూరు జిల్లాలో మహిళ ఆత్మహత్యాయత్నం... ఇంటి స్థలం కోసం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇంటి స్థలం విషయంలో తహశీల్దార్ వేధిస్తున్నారంటూ ఓ మహిళ పురుగుల ముందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. స్పందన కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకుంటున్న అధికారులు ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంటి స్థలం విషయంలో చేజర్ల ఎమ్మార్వో వేధిస్తున్నారంటూ పురుగులు మంది సేవించేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. దీంతో వెంటనే పక్కనే ఉన్న వాళ్లు ఆమెను అడ్డుకున్నారు. పెరుమాళ్లపాడులో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇల్లు నిర్మించుకోకుండా ఎమ్మార్వో అడ్డుకుంటున్నారని ఆరోపించింది బాధితురాలు.

భూమి విక్రయించిన వారి నుంచి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా తహశీల్దార్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపింది. అయితే తహశీల్దార్ మాత్రం మహిళ ఆరోపణలను ఖండించారు. కొందరు ఆమె వెనుక ఉండి ఈ రకంగా చేయిస్తున్నారని తహశీల్దార్ ఆరోపించారు.






First published: November 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...