• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • WOMAN IN INTOXICATION STAGE KILLED HER HUSBAND AND SET ABLAZE HIS FACE IN HYDERABAD SK

Hyderabad: వైట్నర్‌ మత్తులో భర్తను చంపి.. ముఖాన్ని కాల్చేసి.. పక్కనే కూర్చున్న భార్య..

Hyderabad: వైట్నర్‌ మత్తులో భర్తను చంపి.. ముఖాన్ని కాల్చేసి.. పక్కనే కూర్చున్న భార్య..

ప్రతీకాత్మక చిత్రం

వైట్నర్ మత్తులో ఉన్న రేష్మ.. భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి తీరుతో విసిగిపోయి, చున్నీతో గొంతుకు ఉరివేసి చంపేసింది. అనంతరం భర్త ముఖంపై చెత్తా చెదారం వేసి నిప్పంటించింది.

 • Share this:
  వైట్నర్ మత్తులో ఓ మహిళ కిరాతకానికి పాల్పడింది. కట్టుకున్న భర్తనే దారుణంగా చంపేసి.. ముఖాన్ని తగులబెట్టింది. హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలో ఈ ఘోరం జరిగింది. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం... రేష్మ, సొహైల్‌ (28) భార్యాభర్తలు. నగరంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇల్లు లేదు. ఉదయం కూడళ్ల వద్ద భిక్షాటన చేసి.. రాత్రిళ్లు మూసి ఉన్న దుకాణాల ముందు, ఫుట్‌పాత్‌లపై నిద్రించేరు. వీరిద్దరు మత్తు కోసం వైట్నర్‌ పీల్చేవారు. క్రమక్రమంగా దానికి బానిసయ్యారు. మత్తులేనిదే ఉండలేని పరస్థితికి వచ్చారు. ఐతే సోమవారం డబ్బుల విషయంలో భార్యా, భర్తలు గొడవపడ్డారు.

  రేష్మ భిక్షాటన చేసి డబ్బులు తీసుకు రాగా.. ఆ డబ్బులు ఇవ్వాలని సోహైల్ గొడవ పెట్టుకున్నాడు. అప్పటికే వైట్నర్ మత్తులో ఉన్న రేష్మ.. భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి తీరుతో విసిగిపోయి, చున్నీతో గొంతుకు ఉరివేసి చంపేసింది. అనంతరం భర్త ముఖంపై చెత్తా చెదారం వేసి నిప్పంటించింది. రాత్రి వేళ కావడంతో ఎవరూ గుర్తించలేకపోయారు. ఆ మంటల్లో సోహైల్ మృతదేహం దాదాపు సగం కాలిపోయింది. ఐతే మత్తులో ఉన్న రేష్మ భర్త శవం పక్కనే కూర్చుండిపోయింది. అసలేమీ జరగనట్లుగా ఆమె ప్రవర్తన కనిపించింది. ఉదయం సగం కాలిన స్థితిలో ఫుట్‌పాత్‌పై మృతదేహం ఉండడంతో.. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

  స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇన్‌స్పెక్టర్‌ రుద్రభాస్కర్‌, ఎస్‌ఐ వెంకటేశ్‌ స్థానికులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి.. రేష్మను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. కాగా, నగరంలోని స్లమ్ ఏరియాల్లో వైట్నర్ పీల్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా భిక్షాటన చేసే వారు దీనికి బానిసవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో.. తక్కువ ధరకే.. ఎక్కువ మత్తు ఇచ్చే వైట్నర్‌కు బానిసలవుతున్నారు. ఆ మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు చోరీలు చేస్తుండగా.. ఇంకొందరైతే ఏకంగా హత్యలే చేస్తున్నారు. ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు