శాలరీ అడిగితే అరాచకం... మహిళా ఉద్యోగిని చితకబాదిన బాస్

Greater Noida Crime : రూ.17,000 శాలరీ అడిగితే ఆ యువతిని రేప్ చెయ్యబోయాడు సెలూన్ ఓనర్ ఫ్రెండు. గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 15, 2019, 8:37 AM IST
శాలరీ అడిగితే అరాచకం... మహిళా ఉద్యోగిని చితకబాదిన బాస్
మహిళను చితకబాదుతున్న వసీం అతని ఫ్రెండ్స్ (Image : Twitter)
  • Share this:
గ్రేటర్ నోయిడాలోని యూనీసెక్స్ సెలూన్‌లో పనిచేస్తోంది 25 ఏళ్ల ఆ బాధితారులు. శాలరీ విషయంలో జరిగిన గొడవతో... ఆమెను తన బాస్ వసీం మరో ముగ్గురు స్నేహితులు కలిసి చితకబాదారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్‌లో వైరల్ అయ్యింది. ఆ వీడియోరలో ఆమెను జుట్టు పట్టుకొని లాగి, చితకబాదారు వాళ్లు నలుగురూ. ఈ వీడియో ఆధారంగా పోలీసులు ఘటన జరిగిన రెండ్రోజుల తర్వాత సెలూన్ ఓనర్‌ వసీంను అరెస్టు చేశారు. భాంగెల్‌లో నివసిస్తున్న ఆమె... నాలెడ్జ్ పార్క్ 2లో ఉన్న వీనస్ యూనీసెక్స్ సెలూన్‌లో మేకప్ ఆర్టిస్టుగా మార్చి 16న చేరింది. ఆమెకు నెలకు రూ.17,000 ఇస్తానన్నాడు దాని ఓనర్. తీరా నెల తర్వాత శాలరీ అడిగితే... అప్పటి నుంచీ తనతో ఫిజికల్ రిలేషన్‌షిప్ (శారీరక సంబంధం) పెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాడట వసీం.లైంగిక వేధింపులు భరించలేక ఆమె ఉద్యోగం మానేసింది. శనివారం సాయంత్రం ఏప్రిల్ 16 వరకూ చేసిన పనికి శాలరీ తీసుకోమని వసీం ఆమెను పిలిచాడు. ఆమె సెలూన్‌కి వెళ్లాక వసీం ఫ్రెండ్ షేరా... ఆమెను రేప్ చెయ్యబోయాడు. బలవంతంగా తప్పించుకున్న ఆమె... సెలూన్ నుంచీ బయటకు పరిగెత్తుకొచ్చింది. అంతే వెనకాలే వచ్చిన వసీం అతని ముగ్గురు ఫ్రెండ్సూ... ఆమెను చితకబాదారు. లక్కీగా ఆ టైంలో చుట్టూ జనం ఉన్నారు. వాళ్లు ఆమెను రక్షించారు.

బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో... నిందితులు నలుగురూ పారిపోవాలని చూశారు. ఆల్రెడీ వసీంను అరెస్టు చేసిన పోలీసులు, మిగతా ముగ్గుర్ని కూడా పట్టుకుంటామంటున్నారు. 

ఇవి కూడా చదవండి :

కమల్ హాసన్‌పై 3 కేసులు నమోదు... హిందూ ఉగ్రవాది వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం...

విచారణకు వస్తారా... అరెస్ట్ అవుతారా... నేడు తేలనున్న రవి ప్రకాష్ ఫ్యూచర్...

నేడు పులివెందులలో జగన్ ప్రజాదర్బార్... రాయలసీమలో వైసీపీ గెలుపుపైనా సమీక్ష..?

టీడీపీకి 110 సీట్లు... వైసీపీకి యూత్ ఓట్లు... చంద్రబాబు సర్వేల్లో తేలింది ఇదేనా..?
First published: May 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading