కోరిక తీర్చాలని ఆసుపత్రిలోనే బలవంతం.. అతని దారుణానికి ఆమె కోమాలో..

Sexual Assault on Wife : అతని దాడికి ఆమె తీవ్ర రక్తస్రావంతో అక్కడే కుప్పకూలిపోయింది. మరుసటిరోజు తెల్లవారుజామున కుమార్తె వచ్చే చూసేవరకు.. ఆమె అదే రక్తపు మడుగులో పడి ఉంది.

news18-telugu
Updated: April 24, 2019, 8:06 AM IST
కోరిక తీర్చాలని ఆసుపత్రిలోనే బలవంతం.. అతని దారుణానికి ఆమె కోమాలో..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 24, 2019, 8:06 AM IST
భార్యా పిల్లలపై ఏమాత్రం పట్టింపు లేని ఓ తాగుబోతు భర్త రాక్షసుడిలా ప్రవర్తించాడు. కన్నబిడ్డ తీవ్ర జ్వరంతో బాధపడుతుంటే పట్టించుకుందామన్న కనీస ఆలోచన కూడా రాలేదు. పైగా బిడ్డ కోసం ఆరాటపడుతున్న భార్యను ఆసుపత్రిలో అందరి ముందు బలవంతపెట్టాడు. తన లైంగిక కోరిక తీర్చాల్సిందేనని పట్టుబడ్డాడు. ఓవైపు బిడ్డ కోసం ఆరాటం.. మరోవైపు పశువులా ప్రవర్తిస్తున్న భర్త.. ఎటూ తేల్చుకోలేక చివరకు అతనితో వెళ్లినందుకు ఇప్పుడామె మృత్యువుతో పోరాడుతోంది.

చిత్తూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఈ దారుణం జరిగింది. తమ పెద్దమ్మాయికి(16) జ్వరం రావడంతో పద్మ అనే మహిళ ఇటీవల ఆమెను ఆసుపత్రిలో చేర్చింది. డాక్టర్లు బెడ్ అడ్మిట్ చేయడంతో అక్కడే ఉండి కుమార్తె బాగోగులు చూసుకుంటోంది. ఇదే క్రమంలో ఆదివారం ఆమె భర్త నంద పీలకదాకా తాగి ఆసుపత్రికి వచ్చాడు. రావడమే ఆలస్యం.. తన కోరిక తీర్చాలంటూ భార్యను బలవంతపెట్టాడు.ఓవైపు బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఆసుపత్రికి వచ్చి ఇలాంటి పనులేంటని ఆమె అతన్ని వారించింది. అయినా అతను వినలేదు. సెక్యూరిటీ గార్డ్ బయటకు పంపించడంతో.. కొద్దిసేపు బయటకెళ్లిన అతను.. తిరిగి రాత్రి 11గంటలకు మళ్లీ వార్డులోకి వచ్చాడు. అందరి ముందు పరువు తీసేలా వ్యవహరిస్తుండటంతో ఇక ఆమె అతనితో వెళ్లక తప్పలేదు.

పైవార్డులోకి ఆమెను తీసుకెళ్లిన నంద.. అక్కడే తన కోరిక తీర్చాలని బలవంతపెట్టాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో విచక్షణారహితంగా కొట్టాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేసి పారిపోయాడు. అతని దాడికి ఆమె తీవ్ర రక్తస్రావంతో అక్కడే కుప్పకూలిపోయింది. మరుసటిరోజు తెల్లవారుజామున కుమార్తె వచ్చే చూసేవరకు.. ఆమె అదే రక్తపు మడుగులో పడి ఉంది. వైద్యులకు సమాచారం అందించగా ఆమెను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతర్గత అవయవాలకు తీవ్ర గాయాలవడంతో రక్తస్రావం జరిగి కోమాలోకి వెళ్లినట్టు చెప్పారు. మరో 24గంటలు గడిస్తే తప్ప ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమనడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. పద్మపై దాడి చేసినందుకు భర్త నందపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

ఇది కూడా చదవండి : కోరిక తీర్చాలని ఆసుపత్రిలోనే బలవంతపెట్టాడు.. చివరకు ఎంత దారుణం చేశాడంటే..

First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...