మహేష్ బాబు రావాల్సిందే.. విజయవాడలో యువతి హల్‌చల్

యువతి హల్‌చల్‌తో అక్కడ చాలామంది గుమిగూడారు. అయితే ఆమె మతిస్థిమితం లేని యువతి అని తెలియడంతో.. అధికారులు ఆమెను నిధానంగా కిందకు దించే ప్రయత్నం చేశారు.

news18-telugu
Updated: October 16, 2019, 3:17 PM IST
మహేష్ బాబు రావాల్సిందే.. విజయవాడలో యువతి హల్‌చల్
మహేష్ బాబు ఫైల్ ఫోటో
  • Share this:
విజయవాడ రెవెన్యూ కాలనీలోని అగ్రిగోల్డ్ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం ఓ యువతి హల్‌చల్ చేసింది. కార్యాలయ ప్రాంగణంలోని ఓ చెట్టు పైకి ఎక్కిన యువతి.. మహేష్ బాబు అక్కడికి రావాలని డిమాండ్ చేసింది.మహేష్ బాబు రావాలని.. మోదీతో మాట్లాడాలని.. జగన్ కూడా తన మొర ఆలకించాలని వేడుకుంది. అయితే ఆమె ఎందుకలా ప్రవర్తిస్తుందో తెలియక స్థానిక అధికారులు తలపట్టుకున్నారు. కొంతమంది ఆమెను వీడియో తీస్తుండగా చెట్టు కొమ్మలు విరిచి వారి పైకి విసిరేసింది. యువతి హల్‌చల్‌తో అక్కడ చాలామంది గుమిగూడారు. అయితే ఆమె మతిస్థిమితం లేని యువతి అని తెలియడంతో.. అధికారులు ఆమెను నిధానంగా కిందకు దించే ప్రయత్నం చేశారు. మొదట కొంతమంది చెట్టు పైకి ఎక్కే ప్రయత్నం చేయగా.. ఆమె కర్రలతో వారిపై దాడికి యత్నించింది. దీంతో కిందకు దిగేశారు. అనంతరం ఫైరింజన్ సిబ్బంది అక్కడికి చేరుకుని.. చెట్టు కింద వలను అమర్చారు.ఆపై నిచ్చెన సహాయంతో పైకి చేరుకుని.. నచ్చజెప్పి ఆమెను కిందకు దించారు. పోలీసుల విచారణలో ఆమె పేరు అనిత అని, కోల్‌కతా నుంచి వచ్చి విజయవాడలో కొంతమంది చేతిలో మోసపోయినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆమెకు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సలు అందిస్తున్నారు.

First published: October 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading