ప్రియుడితో శృంగారానికి భర్త అడ్డుగా ఉన్నాడని...కరోనా అడ్డం పెట్టుకొని...దారుణం...

భ‌ర్త‌ బయటకు వెళ్లగానే ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిచి...ఇద్దరూ కలిసి శృంగార లీలల్లో మునిగి తేలేవారు. అయితే ఆమె ప్రియుడితో అలా చాలా కాల‌మే ఎంజాయ్ చేసింది‌. భర్త లేని సమయంలో ఇద్దరూ కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిరిగేవారు.

news18-telugu
Updated: July 12, 2020, 9:38 PM IST
ప్రియుడితో శృంగారానికి భర్త అడ్డుగా ఉన్నాడని...కరోనా అడ్డం పెట్టుకొని...దారుణం...
ప్రతీకాత్మకచిత్రం (Facebook)
  • Share this:
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మహిళ తన కుటుంబాన్ని ఛిన్నా బిన్నం చేసుకుంది. వివాహేతర బంధాలు కుటుంబ వ్యవస్థలను నాశనం చేస్తాయని తెలిసినా...ఓ మహిళ తన ప్రియుడి వలలో పడి కట్టుకున్న భర్తనే కాటికి పంపించింది. అయితే భర్తను చంపేసి కరోనాతో చనిపోయాడని కవరింగ్ చేద్దామనుకుంది. కానీ ఆప్రయత్నమే ఆమెను నేరస్థురాలిగా మార్చింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఒడిశాకి చెందిన 45 ఏళ్ల శరత్ దాస్‌కు.. భార్య అనిత, అలాగే ఇద్దరు పిల్లలతో కలిసి ఢిల్లీలోని నోయిడాలో నివాసం ఉంటున్నారు. కొంత కాలం సంసారం బాగానే సాగింది. అనితకి అదే ప్రాంతానికి చెందిన ఓ యువ‌కుడితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.. అదికాస్తా వివాహేత‌ర సంబంధంగా మారింది. భ‌ర్త‌ బయటకు వెళ్లగానే ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిచి...ఇద్దరూ కలిసి శృంగార లీలల్లో మునిగి తేలేవారు. అయితే ఆమె ప్రియుడితో అలా చాలా కాల‌మే ఎంజాయ్ చేసింది‌. భర్త లేని సమయంలో ఇద్దరూ కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిరిగేవారు. పిల్లలు చూస్తున్నా పట్టించుకోకుండా...బెడ్రూంలో దూరి పడక సుఖం పొందేవారు.

అయితే ఇలాంటి వ్య‌వ‌హారాలు ఎక్కువ‌కాలం దాగ‌వు. గుట్టుగా సాగుతున్న వ్య‌వ‌హారం భర్తకి తెలిసిపోయింది. దీనిపై భర్తకు అనుమానం వచ్చి నిలదీయగా, అసలు సంగతి బయటపడింది. అయితే.. భ‌ర్త‌ను ఎలాగైనా హ‌త్య చేస్తే ప్రియుడితోనే ఎల్లకాలం ఎంజాయ్ చేయాల‌ని ప్లాన్ చేసిన భార్య‌.. ప్రియుడితో కలసి ఆ ప్లాన్ అమ‌లు చేసింది.. భ‌ర్త నిద్రిస్తున్న స‌మ‌యంలో.. ప్రియుడితో క‌లిసి దిండుతో ఊపిరాడకుండా చేసి హ‌త్య చేసింది.. అనంత‌రం తన భర్త కరోనాతో చనిపోయాడంటూ నమ్మించే ప్ర‌య‌త్నం చేసింది.. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. మృతదేహాన్ని పరిశీలించి పోలీసులు.. క‌రోనా టెస్ట్ రిపోర్ట్ ఏది అని ప్ర‌శ్నించారు.. దీంతో.. పొంత‌న‌లేని స‌మాధానాలు ఇచ్చింది భార్య‌.. ఇక‌, ఆ మృత‌దేహాన్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించి పోస్టుమార్టం నిర్వ‌హించ‌గా.. హ‌త్య‌గా తేలింది.. భార్యని అదుపులోకి త‌మ‌దైన త‌ర‌హాలో విచార‌ణ చేయ‌గా.. అస‌లు విష‌యం బ‌ట‌య‌పెట్టింది.
Published by: Krishna Adithya
First published: July 12, 2020, 9:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading