news18-telugu
Updated: November 4, 2020, 12:32 AM IST
ప్రతీకాత్మకచిత్రం
వివాహేతర బంధాల మోజుల పడి వావీవరుసలు మరిచిపోతున్నారు. క్షణం సుఖం కోసం మానవవిలువలను వదిలేస్తున్నారు. తాజాగా ఓ మహిళ తనకన్నా 20 సంవత్సరాలు తక్కువ వయస్సు ఉన్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఆ బంధాన్ని ఎవరికీ అనుమానం రాకుండా ఎలాగైనా కొనసాగించాలని, తన ప్రియుడిని కన్న కూతురికి ఇచ్చి పెళ్లి చేసింది. చివరకు కూతురు కంట్లో ఆ అపవిత్ర బంధం పడటంతో, అసలు రంకు కదిలింది. వివరాల్లోకి వెళితే ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ ఏరియా కేసీఆర్ నగర్లో ఓ దారుణ ఘటన జరిగింది. ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసీఆర్ నగర్‌కి చెందిన సునీత (పేరు మార్చాం) భర్తకు దూరంగా ఉంటూ తన కూతురితో కలిసి జీవిస్తోంది. సునీతకు అదే ప్రాంతానికి చెందిన కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. 20 సంవత్సరాల కుమార్ స్థానికంగా ఉన్న పరిశ్రమలో పనిచేసేవాడు. తరచూ సునీతను పలకరిస్తూ, సరదాగా మాట్లాడేవాడు. దీంతో సునీత అతడిని తన వలలో వేసుకోవాలనుకుంది. అతడికి మాటల్లో పెట్టి చివరకు అతడితో లైంగిక బంధం ఏర్పరచుకుంది. ఇద్దరూ కలిసి పగలు రాత్రి తేడా లేకుండా సెక్స్ ఎంజాయ్ చేసేవారు. అయితే ఈక్రమంలో కుమార్ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని సునీతకు చెప్పాడు. దీంతో సునీత మెదడులో ఆలోచన బయలుదేరింది. తన ప్రియుడినే అల్లుడిగా చేసుకోవాలనుకుంది. ఇంకేముంది అతడిని కూతురికి వివాహం జరిపించింది. అయితే పెళ్లైన కొద్దిరోజులకే తన భర్తకి తల్లితో వివాహేతర సంబంధం ఉందని కూతురికి తెలిసిపోయింది.
తల్లితో భర్త రాసలీలలు వ్యవహారంతో యువతి మానసికంగా కుంగిపోయింది. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు చనిపోయిన తర్వాత కూడా అత్తా అల్లుడు నిస్సిగ్గుగా తమ బంధాన్ని కొనసాగించినట్లు తెలుస్తోంది. అత్త సునీతకు అల్లుడు కుమార్ మధ్య గొడవ జరిగింది. దీంతో సునీత తన అల్లుడిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నవీన్ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Published by:
Krishna Adithya
First published:
November 4, 2020, 12:32 AM IST