డబ్బులు ఇవ్వలేదని గర్ల్ ఫ్రెండ్ మొఖంపై శానిటైజర్ పోసి...నిప్పు పెట్టి...దారుణం...

డబ్బు ఇవ్వలేదని ప్రేమించే గర్ల్ ఫ్రెండ్ ముఖంపై శానిటైజర్ పోసి..నిప్పు పెట్టిన ఘటన చండీగఢ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆమె ముఖం కాలిపోయిందని పోలీసులు తెలిపారు.

news18-telugu
Updated: July 13, 2020, 7:31 PM IST
డబ్బులు ఇవ్వలేదని గర్ల్ ఫ్రెండ్ మొఖంపై శానిటైజర్ పోసి...నిప్పు పెట్టి...దారుణం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహిళలపై అత్యాచారం, నేరాలు ఆందోళనకర స్థాయిలో రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా చండిగడ్ లో జరిగిన ఘటనతో కలకలం మొదలైంది. డబ్బు ఇవ్వలేదని ప్రేమించే గర్ల్ ఫ్రెండ్ ముఖంపై శానిటైజర్ పోసి..నిప్పు పెట్టిన ఘటన చండీగఢ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆమె ముఖం కాలిపోయిందని పోలీసులు తెలిపారు. ఆమె కేకలు విన్న ఇరుగు పొరుగు వారు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారని తెలిపారు. కేవలం డబ్బుల కోసమే అతడు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని వారు చెప్పారు. కాగా.. బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు. డబ్బుల కోసం అతడు బాధితురాలిని తరచూ వేధించేవాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని వారు అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉంటే ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలు ఒక సామాజిక నేరం. ఆడవాళ్లను కళ్లార్పకుండా చూడడం కూడా నేరమని నిర్భయ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసు వ్యవస్థణు బలోపేతం చేశామని ప్రభుత్వం అంటోంది. కానీ తాజా సంఘటన గమనిస్తే ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటిమూటలని తేలింది. అంతేకాదు గతంలో కన్నా మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
Published by: Krishna Adithya
First published: July 13, 2020, 7:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading