మరిదితో సంబంధం పెట్టుకుందని మహిళ జుట్టు కత్తిరించేశారు.. కానీ అంతా ప్లాన్ ప్రకారమే అంటున్న మహిళ..

ప్రతీకాత్మక చిత్రం

భర్తను కోల్పోయి ఒంటరిగా ఉంటున్న మహిళ వద్ద.. ఆమె బావ(భర్త అన్న) పరితోష్ సర్దార్, మరికొంత మంది యువకులు పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అయితే వారిని ఆమె తిరస్కరించింది.

  • Share this:
    భర్తను కోల్పోయి.. పిల్లలతో కలిసి అత్తింట్లో ఉంటున్న మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. మహిళ తన మరిదితో ఎఫైర్‌ పెట్టుకుందని ఆరోపిస్తూ.. ఆమె బావ, మరికొందరు కలిసి నీచమైన చర్యకు పాల్పడ్డారు. ఆమె జుట్టును కత్తిరించారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని క్యానింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాబూ ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. 40 ఏళ్ల మహిళ, మూడేళ్ల క్రితం తన భర్తను కోల్పోయింది. ఆమె ప్రస్తుతం అత్తారింట్లో తన ఇద్దరు కొడుకులతో కలిసి ఉంటుంది. తనకు జరిగిన అన్యాయంపై మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి మహిళ పేర్కొన్న ఏడుగురు నిందితుల్లో.. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు.

    అందుతున్న సమాచారం ప్రకారం.. మహిళ భర్తను కోల్పోయిన తర్వాత తన కొడుకులను పోషించడానికి చాలా కష్టపడుతుంది. ఇదే అదనుగా భావించిన ఆమె బావ(భర్త అన్న) పరితోష్ సర్దార్, మరికొంత మంది యువకులు పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అయితే వారిని ఆమె తిరస్కరించింది. దీంతో వారు ఆమెను గ్రామం నుంచి బహిష్కరిస్తామని బెదిరించారు. ఈ పరిస్థితుల్లో మహిళ.. తన మరిది ఖుదిరామ్ సర్దార్ సాయం కోరింది. ఈ క్రమంలోనే నిందితులు ఆమెను లక్ష్యంగా చేసుకన్నట్టుగా బాధితురాలి జూలై 29న క్యానింగ్ పోలీస్ స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేసింది.

    ‘జూలై 28న సాయంత్రం 5 గంటల సమయంలో ఖుదీరామ్.. మొబైల్ ఫోన్‌తో రూమ్‌లోకి వచ్చాడు. ఆమె తల్లి లైన్‌లో ఉన్నట్టు చెప్పాడు. అప్పుడే పరితోష్, ఇతర నిందితులు.. అక్కడికి వచ్చి ఖుదీరామ్‌కు, ఆ మహిళకు వివాహేతర సంబంధం ఉందని వాదించారు’అని ఫిర్యాదులో ఉందని పోలీసులు తెలిపారు. నిందితులు తనను కొట్టినట్టు మహిళ ఆరోపించిందని పోలీసులు చెప్పారు. మహిళ జుట్టును కత్తిరించే ముందు నిందుతులు ఖుదీరామ్‌ను కర్రలతో కొట్టినట్టుగా పేర్కొన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: