Tragedy: సొంతూరు నుంచి భార్యను సిటీకి తీసుకెళ్లి కాపురం పెడితే ఇంత జరుగుతుందని ఆ భర్త అస్సలు ఊహించి ఉండడు..!

పోలీసుల అదుపులో నిందితురాలు

వివాహేతర సంబంధాలు, పెళ్లికి ముందే సహ జీవనం ఈరోజుల్లో చాలాచోట్ల జరుగుతున్నాయి. ఈ రెండింటి వల్ల అనర్థాలు, జీవితాలు నాశనం కావడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడితే, సహ జీవనం వంటి సంబంధాలు ఎంతోమంది జీవితాలను నట్టేట ముంచుతున్నాయి. రోజూ ఏదో ఒకచోట ఇలాంటివి జరుగుతున్నా కొందరిలో ఏమాత్రం మార్పు రావడం లేదు.

  • Share this:
    నోయిడా: వివాహేతర సంబంధాలు, పెళ్లికి ముందే సహ జీవనం ఈరోజుల్లో చాలాచోట్ల జరుగుతున్నాయి. ఈ రెండింటి వల్ల అనర్థాలు, జీవితాలు నాశనం కావడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడితే, సహ జీవనం వంటి సంబంధాలు ఎంతోమంది జీవితాలను నట్టేట ముంచుతున్నాయి. రోజూ ఏదో ఒకచోట ఇలాంటివి జరుగుతున్నా కొందరిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఓ యువకుడి మోజులో పడి తన భర్తను యువతి చేతులారా చంపుకున్న ఘటన నోయిడాలో కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముఖేష్ అనే 22 ఏళ్ల యువకుడు ఓ యువతిని ప్రేమించి కొన్నేళ్ల నుంచి ఆమెతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. సొంత ఊరు వదిలి ఇద్దరూ కలిసి నోయిడాలో కాపురం పెట్టారు. ఇద్దరూ పెళ్లి చేసుకోకపోయినప్పటికీ భార్యాభర్తల్లానే కలిసి ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఈ జంట జీవితంలోకి అంకుష్ అనే ఓ యువకుడి ఎంట్రీ వీరి జీవితాలను తలకిందులు చేసింది. తన ఇంటికి పొరుగున ఉండే అంకుష్‌తో ముఖేష్ భార్యకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్ని నెలలు ఇద్దరూ ముఖేష్‌ కళ్లుగప్పి వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. అయితే.. ఇటీవల ముఖేష్‌కు ఈ విషయం తెలిసింది.

    పెళ్లి చేసుకోకపోయినా భార్యలా చూసుకుంటున్న తనను కాదని మరొకరితో సంబంధం పెట్టుకోవడాన్ని సహించలేకపోయాడు. ఇంట్లో ఇద్దరు పిల్లలున్న సంగతి కూడా మరచి ఏం పనంటూ భార్యను నిలదీశాడు. ఈ విషయంలో ఆమెతో గొడవ పడి తిట్టికొట్టాడు. దీంతో.. తీవ్ర మనస్తాపం చెందిన ముఖేష్ భార్య ఈ విషయాన్ని తన ప్రియుడు అంకుష్‌కు చెప్పింది. తన భర్త అడ్డు తొలగించుకోవాలని అతనికి చెప్పడంతో ముఖేష్ హత్యకు ఇద్దరూ కలిసి పక్కాగా ప్లాన్ చేశారు. తన భర్తపై లేని ప్రేమను ఒలకబోస్తూ ఆమె మద్యం తాగించింది. మత్తులో తూలిపోయి భర్త నిద్రలోకి జారుకోగానే.. పిల్లలను కూడా నిద్రబుచ్చి ప్రియుడికి ఫోన్ చేసింది. అంకుష్ ఆమె ఇంటికి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి మద్యం మత్తులో ఉన్న ముఖేష్‌ను చంపేశారు.

    ఇది కూడా చదవండి: Female Partner: అక్క ఇంట్లో అద్దెకు దిగిన కుర్రాడితో పరిచయం.. నాలుగేళ్ల నుంచి శారీరకంగా కలుస్తూనే ఉన్నారు.. ఇప్పుడేమైందంటే..

    తెల్లవారుజామున ముఖేష్ ఇంటి నుంచి కేకలు వినిపించాయి. తన భార్య ఏడుస్తుండటాన్ని ఇరుగుపొరుగు గమనించి ఏమైందని అడిగారు. రాత్రి మద్యం మత్తులో నిద్రపోయిన తన భర్త ఉదయాన్నే చనిపోయి కనిపించాడని ముఖేష్ భార్య మొసలి కన్నీరు కార్చింది. పోలీసులకు కూడా ఇదే కట్టుకథను చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే.. ముఖేష్ భార్య ప్రవర్తనపై పోలీసులకు అనుమానమొచ్చింది. స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో తన భర్తను ప్రియుడితో కలిసి చంపినట్లు ఒప్పుకుంది. పోలీసులు ఆమెను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.
    Published by:Sambasiva Reddy
    First published: