కొత్త పెళ్లికొడుక్కి షాక్..పెళ్లి మండపంలోనే భార్య గర్భవతి అని తెలిసి...

మూడుముళ్లు వేసి ఇంటికి తీసుకు వెళ్లాల్సిన భార్య గర్భవతి అని తెలిసి పెళ్లి కుమారుడు షాక్ తిన్నాడు. వైద్య పరీక్షల్లో ఆమె 5 నెలల గర్భవతి అని తేలింది.

news18-telugu
Updated: December 25, 2019, 7:34 PM IST
కొత్త పెళ్లికొడుక్కి షాక్..పెళ్లి మండపంలోనే భార్య గర్భవతి అని తెలిసి...
పీసీ ప్యాపిలి తండాకు చెందిన సురేంద్ర నాయక్ (45) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
  • Share this:
మూడుముళ్లు వేసి పెళ్లాడిన భార్య అప్పుడే గర్భవతి అని తెలియడంతో ఓ యువకుడు షాక్ తిన్నాడు. వివరాల్లోకి వెళితే...పశ్చిమ బెంగాల్‌లోని బీర్బుమ్‌కి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన కుమార్ (పేరుమార్పు) అనే యువకుడితో వివాహం చేసుకుంది. అయితే వివాహ వేదికపై  వివాహ తంతు ముగిసేలోగా యువతి ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. అక్కడే ఉన్న ఓ వైద్యుడు యువతికి ప్రాథమిక చికిత్స చేశాడు. అయితే చికిత్సలో భాగంగా యువతి గర్భం దాల్చిందని తేలింది. మూడుముళ్లు వేసి ఇంటికి తీసుకు వెళ్లాల్సిన భార్య గర్భవతి అని తెలిసి పెళ్లి కుమారుడు షాక్ తిన్నాడు. వైద్య పరీక్షల్లో ఆమె 5 నెలల గర్భవతి అని తేలింది. దీంతో పెళ్లి మంటపంలోనే ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

ఇదిలా ఉంటే పెళ్లి కుమార్తె స్నేహితుడే ఆమె గర్భం దాల్చడానికి కారణమయ్యాడని తేలింది. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటపడటంతో వారు తమ కుమార్తెను మోసం చేసిన యువకుడిపై కేసు పెట్టారు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇది కూడా చూడండి :
Published by: Krishna Adithya
First published: December 25, 2019, 6:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading