నగ్నంగా కారు నడుపుతూ చిక్కిన మహిళ...ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు వింత అనుభవం..

ఒంటి మీద నూలు పోగు లేకపోయినా అలాగే కారు నడుపుకుంటూ వీధిలోకి వెళ్లిపోయింది. అయితే అటుగా వెళుతున్న వారంతా ఈ భామను కారులో నగ్నంగా చూసి ఆశ్చర్యపోయారు. పట్టపగలు ఇదేం చోద్యం రా నాయనా అంటూ తల దించుకొని వెళ్లిపోయారు.

news18-telugu
Updated: November 11, 2019, 6:17 PM IST
నగ్నంగా కారు నడుపుతూ చిక్కిన మహిళ...ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు వింత అనుభవం..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
మద్యం మత్తులో ఒంటి మీద నూలు పోగు లేకుండా కారు నడుపుతున్న ఓ మహిళను పోలీసులు అడ్డుకోగా వీరంగం సృష్టించిన ఘటన టెక్సాస్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నిందితురాలు మిన్నీ జాక్ గతవారం ఓ పార్టీకి వెళ్లింది. ఆ పార్టీ న్యూడ్ థీమ్ కావడంతో అందరూ ఒంటి మీద నూలు పోగు లేకుండా మారిపోయారు. అదే పార్టీలో అంతా మద్యం కూడా సేవించారు. పార్టీ ముగిసే సమయానికి తెల్లవారి పోయింది. అయితే మిన్నీ కూడా తెల్లవారినా మద్యం మత్తు దిగలేదు. దీంతో ఒంటి మీద నూలు పోగు లేకపోయినా అలాగే కారు నడుపుకుంటూ వీధిలోకి వెళ్లిపోయింది. అయితే అటుగా వెళుతున్న వారంతా ఈ భామను కారులో నగ్నంగా చూసి ఆశ్చర్యపోయారు. పట్టపగలు ఇదేం చోద్యం రా నాయనా అంటూ తల దించుకొని వెళ్లిపోయారు. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఇది గమనించిన ఓ పోలీసు ఆ మహిళను వెంటనే కారు ఆపాడు. పబ్లిక్ లో న్యూసెన్స్ సృష్టించేందుకు ప్రయత్నించినందుకు అరెస్టు చేస్తానని అన్నాడు. దీంతో మహిళ మత్తులో ఉండటంతో నడి రోడ్డు మీదనే నగ్నంగా కారులోంచి దిగింది. ఫలితంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

అంతేకాదు తాను ఎక్కడికి రానని నడి రోడ్డు మీదనే నగ్నంగా బైఠాయించింది. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ ట్రాఫిక్ పోలీసు అదనపు సిబ్బందిని తెప్పించి, ఆ మహిళను అరెస్టు చేయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. అయితే మత్తు దిగిన తర్వాత జరిగింది తెలుసుకున్న మిన్నీ బాధపడింది. అయినప్పటికీ కేసు నమోదు కావడంతో విచారణ కొనసాగుతోంది.

First published: November 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>