Andhra Pradesh: ఎయిర్ పోర్టులో మహిళ మిస్సింగ్... భర్తకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లింది..?
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణాజిల్లా (Krishna District) గన్నవరం (Gannavaram) ఎయిర్ పోర్టులో (Airport) మహిళ మిస్సింగ్ కేసు కలకలం రేపింది. కువైట్(Kuwait) నుంచి వచ్చిన మహిళ నాలుగురోజులైనా ఇంటికి వెళ్లలేదు.
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా గన్నవరం ఎయిర్ పోర్టులో మహిళ మిస్సింగ్ కేసు కలకలం రేపింది. కువైట్ నుంచి వచ్చిన ఆమె ఇంటికి వెళ్లకపోవడంతో ఆమె భర్త పోలీసులను ఆశ్రయించారు.వివరాల్లోకి వెళ్తే పశ్చిమగోదావరి జిల్లా, పెనుమంట్ర మండలం, నెలమూరుకు చెందిన సాలసత్తి దుర్గ నాలుగు రోజుల క్రితం కువైట్ నుంచి గన్నవరం విమానాశ్రయంలో ఫ్లైట్ దిగింది. ఈ సంగతి ఆమె భర్త సత్యనారాయణకు కూడా తెలియదు. దుర్గ స్నేహితురాలు ఆమె క్షేమంగా ఇంటికి చేరిందా అంటూ సత్యనాపాయణ ఫోన్ కు మెసేజ్ చేయడంతో కంగారు పడిన ఆయన గన్నవరం ఎయిర్ పోర్ట్ పోలీసులను ఆశ్రయించారు. ఎయిర్ పోర్టులో సీసీ ఫుటేజ్ పరిశీలించగా ఈమె ఈనెల 16న కువైట్ వచ్చినట్లు రికార్డయి ఉంది. ఎయిర్ పోర్ట్ బయట కెమెరాలు లేకపోవడంతో ఆమె ఎటు వైపు వెళ్లిందనేది తేలలేదు.
దీనిపై గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు. దుర్గకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇటు విజయవాడ, అటు ఏలూరువైపు హైవేల్లోని సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. దుర్గ మొబైల్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దుర్గ బంధువులు, స్నేహితుల వివరాలు సేకరిస్తున్నారు. అలాగే గన్నవరం ఎయిర్ పోర్టుకు రెగ్యులర్ గా వచ్చే క్యాబ్ డ్రైవర్లను కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
మిస్టరీ వెనుక ప్రశ్నలెన్నో..
దుర్గ మిస్సింగ్ కేసులో పోలీసులకు ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. ఆమె స్వదేశానికి వస్తున్న విషయం స్నేహితురాలికి ఎలా తెలిసింది..? ఒకవేళ దుర్గే ఆమెకు సమాచారం ఇచ్చింది అనుకున్నా.. భర్తకు ఎందుకు చెప్పలేదు..? భార్యభర్తల మధ్య ఏమైనా విభేధాలున్నాయా..? లేక మరో కారణమా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇండియాకు వచ్చి నాలుగురోజులైనా ఇంకా భర్తకు ఎందుకు ఫోన్ చేయలేదు..? స్వగ్రామానికి ఎందుకు వెల్లలేదు? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. తాము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. దుర్గ స్నేహితురాలిన కూడా విచారించి పూర్తి వివరాలు తీసుకుంటామని గన్నవరం పోలీసులు తెలిపారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.