Home /News /crime /

WOMAN GOLD STEALING TRAGEDY AT GOLD SHOP IN MUMBAI PAH

Shocking: చోరీలలో ఆరితెరిన మహిళ.. కేవలం వాటిని మాత్రమే దొంగతనం చేస్తుంది.. మహిళ స్పెషాలిటీ ఎంటో తెలిస్తే షాక్ అవుతారు.

చోరీకి పాల్పడుతున్న మహిళ

చోరీకి పాల్పడుతున్న మహిళ

Mumbai: ఒక మహిళ పోలీసులకు చుక్కలు చూపించింది. వరుసగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసిరింది. ప్రతి రోజు దుకాణాలలో చోరీలు జరుగుతుండటంతో అధికారులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు.

Gold Stealing Tragedy In mumbai: సాధారణంగా దొంగతనం చేయడం కూడా ఒక కళ. దీన్ని 64 కళలలో ఒకటిగా భావిస్తారు. కొంత మంది చోరీలు చేయడం కోసం రకరకాల స్కెచ్ లు వేస్తుంటారు. మందుగా చోరీ చేయబోయే ఇంటిని లేదా దుకాణం దగ్గర రెక్కి నిర్వహిస్తారు. ఆ తర్వాత.. అక్కడ చోరీ చేస్తే.. తప్పించుకునే మార్గాలను చూసుకుంటారు. మన ఇళ్లలో తరచుగా, బంగారానికి మెరుగు పెడతామంటూ వచ్చి దొంగతనాలకు పాల్పడతారు. అదే విధంగా, ఇంట్లో ఒంటరిగా వృద్దులు , మహిళలు ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడతారు.

కొన్ని చోట్ల రోడ్ల మీద బంగారం వేసుకుని వెళ్లే,  మహిళలు, యువతులపై దాడులకు పాల్పడి వారిని దోచుకుంటుంటారు. ఇంకొన్ని చోట్ల దారికాచీ .. మత్తుమందు ఇచ్చి దాడులు చేస్తారు. ఇక కొంత మంది స్మార్ట్ గా చోరీలకు దుకాణాలను స్పాట్ లు ఎంచుకుంటారు. మంచి ఖరీదైన దుస్తులు ధరించి, షాపింగ్ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి మరీ చోరీలకు పాల్పడతారు. ఇక కొందరు నగల దుకాణాలలోను దొంగతనాలకు పాల్పడిన సంఘటనలు కొకొల్లలు. ఇలాంటి వీడియోలు ఇప్పటికే చాలా వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ముంబైలోని ఒక గత కొన్ని రోజులుగా వరుసగా చోరీలు జరుగుతున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో.. గత శనివారం స్థానికంగా ఉన్న ఒక జువెల్లరీ దుకాణంలో ఒక మహిళ చోరీకి పాల్పడి అడ్డంగా దొరికిపోయింది. ప్రస్తుతం ఆమెను అదుపులోనికి తీసుకుని విచారించగా పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు వెలుగులోనికి వచ్చాయి. ఈ మహిళ ప్రతి రోజు దొంగతనం చేయాల్సిన షాపును ముందుగానే సెలక్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత.. కాస్లీ కాస్టూమ్స్ వేసుకుని కస్టమర్ లా బిల్డప్ ఇస్తుంది.

మెయిన్ గా బేబీ టాప్స్ ను మాత్రమే చోరీలు చేస్తుంది. కస్టమర్ లా షాపుకు వెళ్లి.. బేబీ టాప్స్ చూయించాలని చెబుతుంది. షాపులో సిబ్బందిని రకరకాల డిజైలు చూయించాలంటూ కోరుతుంది. షాపులో సిబ్బంది.. కాస్త పక్కకు వెళ్లగానే వెంటనే బేబీ టాప్స్ ను కింద పడేస్తుంది. ఆ తర్వాత.. కింద వంగి వాటిని మెల్లగా తన జాకెట్ లో వేసుకుంటుంది. తాజగా, ఒక షాపులో కూడా అలానే చేసింది.

కానీ మహిళ వ్యవహారం పట్ల సిబ్బందికి అనుమానం కల్గింది. వెంటనే సీసీ కెమెరాను పరిశీలించారు . అప్పుడు మహిళ దొంగతనం చేయడం అందులో స్పష్టంగా రికార్డు అయ్యింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దిండోషి పోలీసులు నలసోపరాకు చెందిన మహిళను అదుపులోనికి తీసుకున్నారు.ఇప్పటి వరకు సదరు మహిళపై 12 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అదే విధంగా, 18 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Maharashtra, Mumbai

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు