రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందాడని చెప్పిన భార్య.. విచారణలో బయటపడ్డ షాకింగ్ నిజాలు..

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని అతని భార్య, కొడుకు జనాలను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఆ కేసును విచారించిన పోలీసులు అసలు నిజాలను వెలికితీశారు.

 • Share this:
  ఓ మహిళ తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని చెప్పింది. కానీ ఆ కేసును విచారించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్యే భర్తను రూ. 6 లక్షలు సుపారి ఇచ్చి హత్య చేయించినట్టుగా తేలింది. ఈ ఘటన కర్ణాటకలోని వైట్ ఫీల్డ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసకుంది. వివరాలు.. గుంజూరుకు చెందిన సుబ్బరాయప్పకు అనే వ్యక్తి మృతదేహం ఇటీవల వైట్ ఫీల్డ్ సమీపంలో బయటపడింది. అయితే అతని భార్య యశోదమ్మ, కుమారుడు దేవరాజు మాత్రం సుబ్బరాయప్ప రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పారు. అయితే సుబ్బరాయప్ప మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరిపారు.

  రోడ్డు ప్రమాదం వివరాలపై ట్రాఫిక్ పోలీసులు విచారించగా సుబ్బరాయప్ప మృతిచెందిన సమయంలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగలేదని తేలింది. దీంతో పోలీసులు అతని కాల్ లిస్ట్‌ను చెక్ చేశారు. అందులో సుబ్బరాయప్ప.. చివరిగా అనిల్ అనే వ్యక్తి చివరగా కాల్ చేశాడని తేలింది. అతడే సుబ్బరాయప్పను స్కార్ఫియోలో తీసుకెళ్లాడని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన సంగతిని గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అనిల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

  నగేష్, ధనుష్, సునీల్‌కుమార్‌ అనే వారితో కలిసి సుబ్బరాయప్పను హత్య చేసినట్టు అనిల్ అంగీకరించాడు. సుబ్బరాయప్ప భార్య, కొడుకు అతని చంపేందుకు రూ. 6 లక్షల సుపారి ఇచ్చారని తెలిపాడు. దీంతో ఆస్తి గొడవల వల్లే భార్య సుబ్బరాయప్పను హత్య చేయించినట్టుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
  Published by:Sumanth Kanukula
  First published: