హోమ్ /వార్తలు /క్రైమ్ /

ప్రసవం తర్వాత ఒంటరిగా ఇంటికి.. పాప ఏదని భర్త నిలదీస్తే చనిపోయిందని చెప్పిన భార్య.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్..!

ప్రసవం తర్వాత ఒంటరిగా ఇంటికి.. పాప ఏదని భర్త నిలదీస్తే చనిపోయిందని చెప్పిన భార్య.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నాలుగు రోజుల తర్వాత ఆమె ఒక్కతే ఇంటికి తిరిగొచ్చింది. పాపా ఏది? అని ఆమె భర్త అడిగాడు. ’చనిపోయింది‘ అని ఆమె ఏడుస్తూ చెప్పింది. ఆసుపత్రి సిబ్బంది దగ్గరలోని శ్మశానంలో పూడ్చిపెట్టారని చెప్పి వాపోయింది..

ఓ మహిళ పండండి పాపకు జన్మనిచ్చింది. పుట్టినప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని డాక్టర్లు చెప్పారు. నాలుగు రోజుల తర్వాత ఆమె ఒక్కతే ఇంటికి తిరిగొచ్చింది. పాపా ఏది? అని ఆమె భర్త అడిగాడు. ’చనిపోయింది‘ అని ఆమె ఏడుస్తూ చెప్పింది. ఆసుపత్రి సిబ్బంది దగ్గరలోని శ్మశానంలో పూడ్చిపెట్టారని చెప్పి వాపోయింది. మన బిడ్డ మనకు లేదండీ అంటూ వలవలా ఏడ్చింది. అయితే ఆమె ఏడుపును చూసి ఆ భర్త జాలిపడినా, ఆమె చెప్పిన వివరాలు మాత్రం నమ్మశక్యంగా అనిపించలేదు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బిడ్డ మిస్సింగ్ మిస్టరీని తేల్చాలని కోరాడు. పోలీసులు విచారణ మొదలు పెట్టి అసలు విషయాన్ని తేల్చేశారు. ఆ తల్లే ఆ పాప మిస్సింగ్ మిస్టరీకి కారణమని వెల్లడించారు. అదే సమయంలో ఆ పాప మరణించలేదన్న నిజాన్ని కూడా బయటపెట్టారు. కాకినాడ నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించని పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కాకినాడ పరిధిలోని ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామానికి చెందిన ఓ మహిళ వారం రోజుల క్రితం కాకినాడ జీజీహెచ్ లో ప్రసవించింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ఆమె భర్తతో పాటు పుట్టింటి వాళ్లు కూడా దగ్గరే ఉన్నారు. అయితే ఆమె ప్రసవించిన నాలుగు రోజుల తర్వాత ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. రెండు రోజుల క్రితం ఆమె ఒక్కతే ఇంటికి వెళ్లింది. పాప ఏదని ఆమె భర్త అడిగితే ’చనిపోయింది‘ అని ఆమె చెప్పి విలవిలా ఏడ్చింది. అయితే భార్య ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురి మిస్సింగ్ మిస్టరీని తేల్చండంటూ కోరాడు.

ఇది కూడా చదవండి: నిర్మానుష్యంగా ఉన్న అతిథిగృహం.. యువకుడితో వెళ్లిన ఓ యువతి.. గెస్ట్ హౌస్ యజమాని కుమారుడు చూసి..

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఒక్కరోజులోనే పాప మిస్సింగ్ మిస్టరీని చేధించారు. ఆ పాప మరణించలేదని తేల్చేశారు. కన్నతల్లే ఆ పాపను వేరే వాళ్లకు ఇచ్చేసిందన్న నిజాన్ని భర్తకు వెల్లడించారు. ఈ విషయమై ఆ భర్త తన భార్యను నిలదీశాడు. ’ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు. ఒక బాబు ఉన్నారు. మళ్లీ ఇంకో పాప అంటే పెంచి పోషించలేమోనన్న భయం కలిగింది. అందుకే పిల్లలు లేని వాళ్లకు ఇచ్చాను. డబ్బులకు అమ్మలేదు. నా కూతురిని ఇచ్చేసినందుకు ఒక్కరూపాయి కూడా తీసుకోలేదు‘ అంటూ ఆ భార్య ఏడ్చేసింది. దీంతో పోలీసులు ఆమె చెప్పిన వివరాలను బట్టి పాపు తీసుకువెళ్లిన వాళ్లను రప్పించి ఆ పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.

ఇది కూడా చదవండి: నా భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు.. 54 రోజుల తర్వాత ట్విస్ట్.. బయటపడిన భార్య బండారం.. అసలేం జరిగిందంటే..

First published:

Tags: Couple affair, Crime news, Crime story, Husband kill wife, Illegal affairs, Wife kill husband

ఉత్తమ కథలు