WOMAN GETS REVENGE ON CHEATING BOYFRIEND BY POSING AS RECRUITER SENDS HIM REJECTION LETTER AFTER MONTH PAH
Viral news: శాడిస్ట్ లవర్.. మాజీ ప్రియుడి పట్ల యువతి పైశాచికం.. ఏం చేసిందో తెలుసా..?
కైరా యువతి(ఫైల్)
Lover Cheating: ఒక యువతి తనను కాదన్నాడని యువకుడిపై కోపం పెంచుకుంది. అతడిని దెబ్బకు దెబ్బ తీయాలను కుంది. తాను అనుభవించిన మానసిక వేదన.. అతను కూడా పడాలని ఒక మాస్టర్ ప్లాన్ వేసింది.
Woman gets revenge on boy friend by posing as recruiter: సాధారణంగా యువతి, యువకులు ఒకరిని మరోకరు స్నేహితులుగా మారతారు. ఆ తర్వాత.. వారి ఇష్టాలు ఒక్కటయ్యాక.. తమ మనస్సులో ఉన్న ప్రేమను ఎదుటివారితో చెబుతారు. కొందరు దీన్ని అంగీకరిస్తారు. మరికొందరు స్నేహితుల్లాగానే ఉండిపోదామని చెబుతారు. ఇంకా.. కొందరు వారిని తిరస్కరించారని శాడిస్టులాగా మారతారు. ఈ క్రమంలో ఎదుటి వారికి ప్రేమ అనే ఫీలింగ్ లేదని ముఖం మీదనే చెప్పేస్తారు. నేటి యువత ఎదుటి వారు తమ ప్రేమను అంగీకంచలేదనగానే.. శాడిస్ట్ లాగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమించిన వారిమీద భౌతిక దాడులకు పాల్పడటం, వారితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తుంటారు. ఇంకొందరు వారి ఇంటికి వెళ్లి.. వారి మర్యాదకు ఇబ్బంది కల్గే విధంగా ప్రవర్తిస్తుంటారు.
కొందరు యాసీడ్ దాడులు, వారిని అఘాయిత్యాలు తెగపడుతుంటారు. ఇలాంటి శాడిస్ట్ వేధింపులలో అమ్మాయిలు, అబ్బాయిలు ఏమాత్రం అతీతులు కాదు. కొన్ని చోట్ల అమ్మాయిలు శాడిస్టులుగా మారితే.. మరికొన్ని చోట్ల అబ్బాయిలు, అమ్మాయిలను వేధిస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి అనేక సంఘటనలు వార్తలలో నిలిచింది. ఇక్కడోక యువతి తన ప్రేమను కాదన్నాడని మాజీ ప్రియుడిని.. ఎవరు ఊహించని విధంగా వేధించింది. ప్రస్తుతం ఈ ఘటన వార్తలో నిలిచింది.
పూర్తి వివరాలు.. కైరా అనే యువని ఆమె.. బాయ్ ఫ్రెండ్ రిజెక్ట్ చేశాడు. దీంతో కోపంతో రగిలిపోయింది. తాను.. ఎలాగైతే మానసిక వేదనకు గురౌతున్నానో.. అతను కూడా అలాగే బాధపడాలని అనుకుంది. దీని కోసం ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. కైరా.. బాయ్ ఫ్రెండ్ ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నాడు. అతని వివరాలు అన్ని యువతి దగ్గర ఉన్నాయి. ఈ క్రమంలో అతను తన జాబ్ ప్రొఫైల్ ను లింక్డ్ఇన్ లో అప్ డేట్ చేశారు. ఒక రోజు కైరా.. హెఆర్ జాబ్ జాబ్ రిక్రూటర్‌గా అతనికి కొత్త నంబర్ తో కాల్ చేసింది. ఆ తర్వాత.. అతడి రెజ్యూమ్, వివరాలు అన్ని తెలుసుకుంది. దాదాపు నెల రోజుల పాటు.. అతడిని దశలుగా ఇంటర్వ్యూ చేసింది.
ఉద్యోగం వచ్చినట్లే అని భరోసా కల్పించింది. చివరి వరకు అతడికి శాలరీ, లక్సరీ లైఫ్ , కంపెనీ బెనిఫిట్స్ అన్ని చెప్పింది. ఇలా మనోడిని నెల రోజుల పాటు.. ఒక రేంజ్ లో కాల్స్ లో మాట్లాడింది. ప్రతి రోజు మెయిల్స్, సర్టిఫికేట్స్, ఇలా వాడిని ముప్పు తిప్పలు పెట్టింది. వేర్వేరు డాక్యుమెంట్స్ కావాలంటూ వాడిని టార్చర్ చేసింది. తీరా అన్ని చేశాక.. చావు కబురు చల్లగా.. నువ్వు ఇంటర్వ్యూకు సెలక్ట్ కాలేదని చెప్పింది. దీంతో అతను పాపం.. నెల రోజుల పాటు పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు లాగా అయిపోయింది. యువతి ఆ విధంగా తన మాజీ ప్రియుడిపై పైశాచికాంనందాన్ని తీర్చుకుంది. ఆ తర్వాత.. దీన్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. నన్ను కాదన్న వాడిపై.. రివేంజ్ తీర్చుకున్నానంటు పోస్ట్ లు పెట్టింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.